యాదవ చంద్రమ్మ దగ్గర పెరిగిన శుక్లపక్షపు చంద్రుడు “బాలచంద్రుడు” – చంద్రుడు కళల్ని, తేజస్సును రంగరించుకుని పదిహేనేళ్ళ వాడయ్యాడు. మహరాజుల వెంట్రుకల్ని పెంచాడు. గుర్రపుస్వారీలో, కర్రవేటులో, కత్తిపోటులో తనను మించినవారు లేదన్నట్టున్నాడు. బాలచంద్రుడు ఎక్కడ పెరిగాడో, ఎంతడివాడయ్యాడో బ్రహ్మనాయుడికి – మాచెర్లలో…
Category: నవలలు – Online Novels
Read Telugu & English novels online.
అధ్యాయం 14 – పల్నాటి వీరభారతం
విజయాన్ని సాధించి తిరిగివచ్చిన బ్రహ్మనాయుడికి అఖండమైన స్వాగతాలతో విజయగీతికలు పాడుతూ మాచెర్ల ప్రభువు, మలిదేవుడితో సహా, ప్రజలూ – ప్రముఖులంతా ఎదురు వచ్చారు. బ్రహ్మనాయుడు చిరునవ్వుతో నగరప్రవేశం చేసాడు. మరునాడు ఉదయం మలిదేవుడు కొలువుదీర్చి, ప్రముఖులతో కూర్చున్నవేళ బ్రహ్మనాయుడు విచ్చేసి…
అధ్యాయం 13 – పల్నాటి వీరభారతం
మనిషి జీవితంలో కాలానిదెప్పుడూ చిత్రమైన పాత్ర. కాలం మనిషినెప్పుడైనా కనికరించవచ్చు; కాటు వేయావచ్చు. అధర్మపు పందెంలో రాజ్యాన్ని పోగొట్టుకున్న మాచెర్ల ప్రభువులు మండాదిలో అనుభవించిన జీవితం అంత సుఖకరమైనది కాదు. రాజప్రాసాదాలలో, హంసతూలికా తల్పాల మీద పవళించిన ప్రభువులు, దుర్భరమైన…
అధ్యాయం 12 – పల్నాటి వీరభారతం
మండాది గుట్టుమట్టులు తెల్సుకోవడానికి అతనికి రెండు మూడు రోజులు పట్టింది. “యాదవ లంకన్న” ఆలమందలకు అధికారి. వేగులవాళ్ళు చెప్పిన మాటలతో పల్నేటి ఇరుకున పడాల్సివచ్చింది. లంకన్న, వట్టి చేతులతో మనుష్యుల్ని చంపగలడు. వీరపడాలు, వీరన్న లాంటి వాళ్ళు మందల్ని కాస్తున్నారని,…
అధ్యాయం 11 – పల్నాటి వీరభారతం
న్యాయం అనేది ఒక కట్టుబాటు. నాగమ్మది మోసం అని తెలిసినా ధర్మానికి కట్టుబడిన బ్రహ్మనాయుడు మలిదేవాదులతో అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు. మాచెర్ల వీరుల్లో పగ రగుల్కొంటోంది. “ఇది అధర్మయుద్ధం. మనం అరణ్యవాసం చేయనక్కరలేదు” అని కొంతమంది అన్నారు. “మాట పాటించనివాడు బ్రతికున్నా…
అధ్యాయం-10 పల్నాటి వీరభారతం
అనుకున్న కాలానికి పుంజులను గోదాలోకి దింపారు. మాచెర్ల పందెగాడు “గోపన్న” బ్రహ్మనాయుడి చేతిలోంచి పుంజును తీసుకున్నాడు. బ్రహ్మనాయుడు పుంజు రెక్కలను నిమిరి నెమ్మదిగా “మా భవిష్యత్తు నీ మీద ఆధారపడి వున్నది” అన్నాడు. మాచెర్ల పుంజు “కొక్కొరొక్కో” అని విజయగీతం…
అధ్యాయం 9 – పల్నాటి వీరభారతం
ఆత్మ గౌరవం కోసం ఈ పందానికి ఒప్పుకున్నాడన్న మాటేగానీ, బ్రహ్మన్నకు ఎందుకనో బెరుగ్గానే వున్నది. ఈ పందాలవల్ల సంభవించే విపరీత పరిణామాలు ఊహించలేని అమాయకుడు కాడు బ్రహ్మన్న. పాచికలాటతో కురు-పాండవ యుద్ధం సంభవించింది. మరి ఈ కోడిపోరు ఏం తెచ్చిపెట్టనున్నదో?…
అధ్యాయం8 – పల్నాటి వీరభారతం
బ్రహ్మనాయుడికి మాల కన్నమదాసు ఎలా ముఖ్యుడో, నాయకురాలు నాగమ్మకు “వీరభద్రుడు” అంతే ముఖ్యుడు. వీరకన్నమదాసు-వీరభద్రుడూ ఒకేరకపు గొప్ప యోధులు. వీరత్వానికి పల్నాటి ప్రతీకలు. మనిషి కన్నా భయంకరమైన జంతువుగానీ, అవిశ్వాసకరమైన ప్రాణిగానీ మరొకటి లేదు. మనిషి పాలు తాగి పెరిగిన…
అధ్యాయం 7-పల్నాటి వీరభారతం
గురజాలకు పశ్చిమంగా ప్రవహించే నది “చంద్రవంక” – నదుల్లో అందమైన పేరున్న చంద్రవంక పరమ పావనమైనదని పల్నాటి ప్రజలు అభిప్రాయపడతారు. ఈ చంద్రవంక నదీ తటానే, బ్రహ్మనాయుడు వూరును వెలయింపజేసి “మాచెర్ల” అని పేరు పెట్టాడు. కొంతకాలం తర్వాత అది…
అధ్యాయం 6 – పల్నాటి వీర భారతం
గండు కన్నమకూ – రేఖాంబకు వున్న ఒకే ఒక కూతురు “మాంచాల” – అపురూపంగా పెరిగింది. ఇటు పేరిందేవి ఎంత గారాల కూచో, అటు మాంచాలా అంతే గారాల కూచి. పేరిందేవి అందం జాతిపూవు చందమైతే – మాంచాల అందం…