అగర్ బత్తీలు, అగరు ధూపం అనగానే మనసులలో ఘుమఘుమలు మెదులుతాయి. అగర్ చెట్టునుండి ఈ పరిమళ ద్రవ్యాలు లభిస్తున్నవి. ఈ అగరు చెట్టు వలన “అగర్తల” అని ఒక నగరానికి పేరు వచ్చింది. అట్లాగ ఆ పేరు ఏర్పడడానికి శ్రీరామచంద్రుని పూర్వీకుడు, ఇక్ష్వాకు కులతిలకుడు అయిన రఘు మహారాజు ప్రధాన కారణం. ఆసక్తికరమైన ఈ కథను మనం తెలుసుకుందామా!
@@@@@@
రఘువంశ సంజాతుడు శ్రీరామచంద్రుడు. కనుక ఆయనకు రాఘవుడు అనే మరో పేరు కూడా ఉన్నది. మూలతః ఇక్ష్వాకు మహారాజు పరంపర కావడం వల్ల ఇక్ష్వాకు వంశము అని ప్రసిద్ధికి వచ్చింది. అటువంటి గొప్ప రాజవంశంలో వచ్చిన రఘు మహారాజు తర్వాత ఇక్ష్వాకు వంశం “రఘు వంశం”గా పేరుపొందింది. రఘువు ధర్మ మార్గాన్ని అనుసరించి, వంశ కీర్తి ప్రతిష్ఠలకు హేతువైనాడు. వంశోత్తమునిగా తర్వాతి తరముల వారిచేత కీర్తింపబడినాడు.
@@@@@@
[amazon_link asins=’B01FM7GGFI,B07FH4PDHJ,B07DB85QZ3,B07D3L7STV’ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’bce87541-0b79-11e9-aa59-d10a72a0f124′]ఒక రోజు మదగజం ఒకటి ఊరును కల్లోలం చేయసాగింది. మత్త గజం పరుగులకు ప్రజలు భీతావహులైనారు. రఘు మహారాజు స్వయంగా ముందుకు వచ్చాడు. అతి సాహసంతో మదపుటేనుగును అడ్డుకున్నాడు. అతని వీరత్వానికి మత్తేభం లొంగిపోయింది. ఆ ఏనుగు కాలికి సంకెల వేసి, లోహితా నదీ తీరాన ఉన్న అగరు వృక్షానికి బంధించాడు రఘు మహారాజు. ఆ నాటి నుండి ఆ ఊరుకు “అగర్తల” అనే పేరు ఏర్పడినది. రఘు ప్రభువు చేసిన ప్రజా రక్షణా సంఘటన ఆ ప్రాంతానికి “అగర్తలా” అనే నామధేయాన్ని కలిగించింది.
@@@@@@