యుద్ధం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

ఎగురుతున్న జెండా ఏమైనా చెబుతుందా !
రణభేరి మ్రోగాలి ఇంటింటా, మదినిండా!
నీ ఆశయాన్నే శ్వాసగా చేసి
ఆయువునే ఊపిరిగా పోసి సమర శంఖం పూరించు!
దోపిడీ వ్యవస్థ దద్దరిల్లెలా
శత్రువు గుండెలలో నెత్తుటి ప్రవాహం గడ్డ కట్టుకు పొయ్యేలా
విజయ ఢంకా మ్రోగించు!
శత్రువు అంటే కోటల లోపల
గోడల వెనుక లేడు నీలోనే ఉన్నాడు
నీ చుట్టూ ఉన్నాడు!
నీ ఆవేశాన్ని ఆయుధంగా
సాహసాన్ని హస్వంగా మార్చుకుని
కురుక్షేత్రం లో సంజయుని వలె బయలుదేరు
మార్గమధ్యంలో స్మశానంలో సమాధులను సందర్శించు
చేసిన దుర్మార్గాలు , మోసిన అపకీర్తిలతో
విశ్రమించు పవిత్ర స్థలం అది
స్వేద బిందువులకే భయపడకు
రణరంగంలో రక్తపుటేర్లు పారచ్చు
విజయమో వీర మరణమో అన్నది ఒకప్పటి మాట
విజయమో వెన్నుపోటో అన్నది ఇప్పటి బాట!
చావును చూచి, ఓటమిని తలచి హడలిపోకు
అవి తధ్యం
ఇది చరిత్ర చెబుతున్న సాక్ష్యం!
వాటిని పలకరించి పరిణయించి
పరిహాసించి పరవశించు!

[amazon_link asins=’B00HWWKH7A’ template=’ProductAd’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’3b15bfd6-0b79-11e9-8e71-5bdbcffd66b6′]

Your views are valuable to us!