కుడుమియన్మలై – ఆలయ నర్తకి ఔదార్యత

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 కుడుమియన్ మలై కోవెల యొక్క అమోఘ విశిష్టతలు :-

ఇది గుహాలయం. “మేలక్కోయిల్”అని, “తిరుమెఱ్ఱాలి” అని పిలుస్తున్నారు. ఏకాండీ శిలను తొలిచి, గుళ్ళు గోపురములను నిర్మించే శైలి, పాండ్యరాజుల కాలమున ఊపందుకున్నది. కుడుమిదేవర్ అఖిలాండేశ్వరి, షట్కోణ ( a single hexagonal slab of granite ) అనగా 6 కోణములు ఖచ్చితమైన కొలతలు కలిగిన మండపము, గ్రానైట్ రాయిలో మలచబడిన తీరు, ఎట్టిపరికరములు, యంత్రములు లేని రోజులలో ఉన్న నాటి శిల్పుల ప్రతిభకు నిదర్శనాలు.

కుడుమినాధాలయము ప్రవేశము వద్ద విఘ్నేశుని గుహాలయం ఉన్నది.

పుదుక్కోట్ తొండమాన్ రాజులు ఉత్సవాలను జరిపారు. హోమాలు, యజ్ఞాలు చేసిన తర్వాత కూడా పై కప్పులకు పొగచూరకుండా ఉండడము  వాస్తుప్రతిభకు నిలువెత్తు అద్దాలు. కుడుమినాధాలయముని 10వ, 13వ, 15వ శతాబ్దములందు చోళ, పాండ్య, విజయనగరచక్రవర్తులు అభివృద్ధి చేసారు.

ఇక్కడి “వేయి స్తంభముల మండపము”లా ఎన్నదగిన శోభ కలిగినది. 645 స్తంభాలలు ఉన్న “వెయ్యిస్తంభాల మండపము” అద్భుతమైనది. రతీమన్మధ శిల్పము నాజూకుదనమునకు తార్కాణమై “వసంతమండపము” సుగ్రీవ, వాలి, హనుమంత, శ్రీరామ, రామాయణఘట్టములను ఇతిహాస, పురాణగాధలను ఎట్టెదుట నిలుపుతున్నవి.

మేలక్కోయిల్ నందు వృషభ వాహనముపై పార్వతీ పరమేశ్వరులు దర్శనమొసగుతున్నారు. 63 నాయనార్లు వరుసగా తీర్చిన శిల్పసంపద విస్మయాన్ని కలిగిస్తుంది.  

@@@@@

3వశతాబ్దమున సదయవర్మ వీరపాండ్యప్రభువు పాలనాకాలమున జరిగిన సంఘటన ఇది…..

కుడుమినాధాలయము నిర్వహణ, వ్యవహారమూల సందర్భమున జన వినుతికెక్కిన ఘటన ఒకటి జరిగినది. ఆలయనర్తకి నిష్కామపరత్వము వానిలో ఒక వాస్తవ సంఘటన.       

13వ శతాబ్దమున సదయవర్మ వీరపాండ్య ప్రభువు పాలనాకాలము. కోవెల ఆస్తి వేలమునకు వచ్చింది. “తిరుక్ కారియన్ మగళ్ ఉమైయాల్ నాచియార్” అను దేవదాసీ స్త్రీ కొన్నది. ఆ ఆలయనర్తకి తాను ఖరీదుచేసిన ఆలయ సంపదలను తిరిగి గుడికే అప్పగించినది.  అటు తర్వాత ఆ గుహాలయానికి సమీపమున ఆమె “సౌందర్యవల్లీ అమ్మన్ దేవాలయాన్ని” కట్టించినది.   

తిరుక్ కారియన్ మగళ్ ఉమైయాల్ నాచియార్ నిష్కామచర్య జనుల ప్రశంసలను అందుకున్నది. ప్రభు సదయవర్మ వీరపాండ్యన్ ఆమెను గౌరవించి, సన్మానం చేసాడు. ఆమె నిరాడంబర జీవనమును జనులు మెచ్చుకున్నారు. తదాదిగా ఆ నాట్యరాణి “తిరుక్కామ కొట్టతు ఆరువుడై మలై మంగై నాచియార్” బిరుదును పొందినది.

@@@@@

Your views are valuable to us!