తిరుమలలోని స్వామివారికి ప్రతిరోజూ నైవేద్యాలు పెడుతూ ఉంటారు. మనకు సాధారణంగాతెలిసేప్రసాదాలులడ్డు,పులిహోర,పొంగలి, వడ, అట్లు ,కదంబం. ఇవికాకఎన్నోరకముల ప్రసాదములు స్వామివారికినైవేద్యం పెడతారు.ఇవి అన్ని శ్రీ వారి ప్రధాన వంటశాలపోటులోతయారు చేస్తారు
స్వామివారికి పెట్టె నైవేద్యాలనుగురించి తెలుసుకుందాం.
వెన్న, పాలు ,చక్కెర బెల్లం కలిపినా నువ్వుల పిండి ,చక్కెర పొంగలి ,అప్పాలు , శుద్దనం, సిరా ,పాయసం ,కేసరిబాత్ క్షిరాన్నం,పంచకజ్జాయం(చక్కెర,గసగసాలు,కలకండ,ఎండుద్రాక్ష,జీడిపప్పు, బాదంపలుకులు,ఎండు కొబ్బరి తురుము మొ. కలిపిన పొడిప్రసాదం ),నెయ్యి దోసెలు,మోల్హర, పండ్ల ముక్కలు, జిలేబి, పెద్దపెద్దమురుకులు, పూర్ణ బూరెలు, శనగ గుగ్గిళ్ళు, బెల్లపు దోసెలు, శాకరిబాత్, పెసరపప్పు పరవాన్నం, బకల బాత్,పానకం, మనోహరం మొ !! నైవేద్యాలు పెడతారు.
వకుళమాత వీటి తయారిని పర్యవేక్షిస్తుంటారుట.