లేత ఆశల కౌగిలి

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 5]

లేత ఆశల కౌగిలి

స్థిరంగా మదిలో ముద్రించిన మోము 

క్రమంగా కాలంలో కరిగిపోదు 

 

అపురూపంగా తోచిన స్పర్శ 

చిరాకుగా ఎన్నడూ మారదు 

 

కాలం దేశం అతీతంగా 

ప్రేమ తన అస్తిత్వాన్ని చాటుతుంది 

అసహజమైన జీవనం లో సైతం

అజరామరంగా వెలుగుతుంది 

 

ఒక మాట, ఒక పరిమళం 

ఒక పాట, ఒక చిత్తరువు 

ఒక జ్ఞాపకం చాలు 

మళ్ళీ అదే ప్రేమను పొందడానికి

 

లేత ఆశల కౌగిలి 

కాలమెరుగని ఆమని 

పుట్టిన ప్రేమ ఇక గిట్టని 

ఒక అపురూపమైన ధుని 

జీవనయానంలో సహచరిణి 

 

*****

dhvani telugu podcast ధ్వని తెలుగు పాడ్కాస్ట్

Your views are valuable to us!