ఋతుగీతం

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 3.7]

చలికాచుకున్న ఆశలు
రెక్కలు విప్పి విహరించే సమయం
శిశిరం తరువాత వసంతం

అందాలు, ఆనందాలు చవిచూసి
ఉక్కిరిబిక్కిరౌతున్న సమయంలో
విరబూసిన వసంతం పలికే ఆహ్వానం గ్రీష్మం

స్వేద బిందువుల రూపంలొ
కష్టమంతా కరిగిపొయి

కల్మషాలు తొలగిపొయే సమయం
వర్షాకాలం

తడిసిన మనసులు భారాన్ని విడచి
తమ కోసం తపనపడే కాలం దైవశోభతొ రంగరించుకొని
వానవెలసి వెన్నెల కురిసే శరత్కాలం

పవనుడు మన్మధునితో జతకట్టి
వెన్నెలను మంచులొ ముంచే కాలం
పౌష్యలక్ష్మి కి నమస్కరించే కాలం

జగత్తు సమస్తం ఒక గమ్మతైన మత్తులొ  
ఓలలాడె సమయమయానికి ద్వారం తెరచి
కాల మహిమను ఆస్వాదించమనే శిశిరం  

*****

Your views are valuable to us!