గురజాడ – హాస్యపు జాడ

Spread the love
Like-o-Meter
[Total: 11 Average: 4.5]


మూలం: తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు

రచన: డా. సి. మృణాళిని

ప్రచురణకర్తలు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్


ప్రముఖులు కొన్నిసార్లు గంభీరంగాను, మరికొన్ని సార్లు అహంభావులుగానూ కనబడుతూవుంటారు. కానీ వారిలో అంతర్లీనంగా హాస్యరసం తొణికిసలాడుతూవుంటుంది.

అలాంటి ప్రముఖుల హాస్యంలో భాగంగా మహాకవి గురజాడ అప్పారావుగారి చెణుకులు చదవండి.

 

 

గురజాడ అప్పారావు బాల్యంలోనే తన విమర్శన దృష్టిని ప్రదర్శించి, పరీక్షల్లో సమాధానాలు స్వంతంగా రాసేవారు. ఈ ‘విశృంఖలత్వం’ వల్ల బి. ఏ. పరీక్ష ఫెయిలయ్యారు.

‘ఇంత చురుకైనవాడివి! నువ్వు ఫెయిలవడమేమిటి?” అని ఒక మిత్రుడు ప్రశ్నిస్తే, “చురుకుపాలు ఎక్కువయ్యే ఫెయిలయ్యాను” అన్నారు గురజాడ.

*****

గురజాడ చేష్టల్లోనూ చిలిపితనమే.

ఒకసారి కోర్టులో తలుపుమీద సుద్దముక్కతో “జి. వి. అప్పారావు; బి. ఏ., బి. ఎల్., — జిల్లా జడ్జి” అని రాశారు. ఈ విషయం జడ్జీగారి దృష్టికి వచ్చింది.

“నువ్వు జడ్జివని మోసపు ప్రకటన చేసినందుకు నిన్ను శిక్షించవచ్చు” అన్నారు జడ్జ్.

“కాదు సర్! నాది ప్రకటన కాదు. కోరిక మాత్రమే.”

“సరే! నీ కోరికను కోర్ట్ తలవాకిలి తలుపు మీదే వెల్లడించాలా? పక్కన గోడ మీద రాయవచ్చుగా?”

“మరి నేను బొగ్గుముక్కతో రాయలేదు కదా! సుద్దముక్కతో రాసాను. వెల్లవేసిన గోడ మీద తెల్లని సుద్దముక్కతో రాయడం తెలివి తక్కువ కదా!”

ఇక ఈ న్యాయవాది ముందు ఏ న్యాయమూర్తి ఏం తీర్పు యివ్వగలడు?

*****

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY

 

Your views are valuable to us!