Like-o-Meter
[Total: 0 Average: 0]
ఇది ఒకప్పటి మాట. ఇప్పటికీ తలచుకోవాల్సిన సంఘటన.
మీనంబాకం విమానాశ్రయంలో దిగారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరంసంజీవయ్య. జనం వేసిన వేసిన పూలదండలు భారీగా ఉండి, కాస్త అవస్థ పడుతూన్నారు. అప్పుడే అక్కడికి వచ్చారు, సినీ నటుడు పేకేటి శివరామం.
“నమస్కారాలు! మీకు వేసేందుకు,నా దగ్గర దండలు లేవండీ!” అని అన్నారు. అందుకు దా. సంజీవయ్య,ఇలా బదులిచ్చారు.”నీ కైదండ ఉండగా, దండ లేదని దండమిడెద వేలమిత్రమా!!!”
ఇది వరకు, తెలుగు భాషా సాహిత్యాల పట్ల ప్రజానీకానికీ,నాయకులకూ భక్తీ అవగాహన ఉండేవి. అందు వలననే ఇలాంటి చమత్కార సమంభాషణలు వెలసి అందరినీ అలరించేవి.
@ @ @ @ @