హరికథా పితామహుడు, అపర సరస్వతి అయినట్టి శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారికి విజయనగరము ఆనంద గజపతిరాజు ఎంతో స్నేహ వాత్సల్యాలు లభించాయి.
ఒకసారి, ఆ ఇద్దరూ పేకాట ఆడుతున్నారు. గజపతి రాజు చాలా ధనమును పోటీలో పెట్టారు. దాసు గారికి “మూడు కింగులు” వచ్చాయి. “తాను గెలిచాను!”అనుకుని, సంబరముతో దాసుగారు తన పేక ముక్కలను పరిచారు. కానీ,ఆనంద గజపతి గారు తన ముక్కలను టేబులు పైన పెట్టారు. “అవి మూడు ఆసులు!!”
దాంతో నారాయణ దాసు అన్నారు “మహారాజా! రాజుల కన్నా ఆసులు గొప్పవి అవుతాయా?”.
ఆ వాక్యంలోనీ హాస్యమూ, దాసు గారి సమయ స్ఫూర్తీ రాజు గారిని మెప్పించాయని
వేరే చెప్ప నక్కర లేదు కదా! గలగలా నవ్వుతూ ఆనందగజపతిరాజా వారు మేజాబల్ల మీద ఉన్న మొత్తము డబ్బును ఆదిభట్ల నారాయణ దాసు గారికి ఇచ్చేసారు.
సాహిత్యాన్ని అవగాహన చేసుకుని, ఆదరిస్తూ,సారస్వత ఆనందాలను పొందగలిగిన ఆనాటి ప్రభువులు ప్రజల మన్ననలను పొందడములో ఆశ్చర్యము ఏమున్నది!?
*******