శ్రీశ్రీ చమత్ “కారాలు”

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

కొత్తగా విప్లవ కవిత్వం రాస్తున్న ఓ యువకవి తన కవితలను శ్రీశ్రీకి పంపి “నా కవితల్లో మరిన్ని నిప్పులు కక్కమంటారా?” అని అడిగితే, “అబ్బే, నిప్పుల్లో నీ పద్యాలు కక్కేయ్ మిత్రమా” అని శ్రీశ్రీ సలహా ఇచ్చారట.

 

* * * * *

ఓ సారి, తను రాసిన పద్యంలో “ర” కు “ఠ” కు శ్రీశ్రీ యతి వేసారట. అదేమిటని అడిగితే, “నేత్ర యతి” అని శ్రీశ్రీ జవాబు ఇచ్చారట.

 

* * * * *

 

గోపీచంద్ దర్శకత్వం వహించిన “పేరంటాలు” ప్రివ్యూ చూసి శ్రీశ్రీ చేసిన వ్యాఖ్య :

 

చూచితి పేరంటాలిని,

వాచెను, నా రెండు కనులు వలవల యేడ్వన్

లేచీ లేవక మునుపే

గోచి విడెను, ఏమనందు గోపీచందూ!

 

* * * * *

 

1950 నాటి పరిస్థితులు ఉటంకిస్తూ ఆచార్య రంగా “ఆంధ్ర దేశంలో సైనికపాలన అవసరం” అని అంటే, ఆనందవాణి పత్రికలో శ్రీశ్రీ ఇచ్చిన రిటార్టు :

 

ఘో “రంగా”‘! క్రూ “రంగా”‘! ఛీ “రంగా”!! థూ “రంగా”‘!

 

* * * * *

 

“ఒరుగులుగా, పొరుగులుగా, ఊరగాయలుగా! పొడిగా ఉప్పుతో నాన వేయడం ద్వారా రసరూపేణా పండ్లు నిల్వ చేసే విధానాలు కనిపిఎట్టాలి” – ఆచార్య రంగా

 

“ఇంత మధురమైన గేయానికి ఎవరైనా స్వరం అవీ వేసి ఆర్కెస్ట్రాతో పాడిస్తే ఎంత బాగుణ్ణు”! – శ్రీశ్రీ

 

* * * * *

Your views are valuable to us!