CLICK HERE TO DOWNLOAD “AMMAMMA” E-BOOK
ఆవకాయ సహ-వ్యవస్థాపకుడు, కవి, రచయిత, విమర్శకుడు కొండముది సాయికిరణ్ కుమార్ వ్రాసిన “అమ్మమ్మ” చిరుపొత్తాన్ని ఈపుస్తకంగా అందిస్తున్నాం.
మానవీయ బంధాలను మరింత పరిపుష్టం చేసే ఆధ్యాత్మికత గురించి అద్భుతంగా చిత్రించిన ఈపుస్తకాన్ని తప్పక చదవండి.
ఆవకాయ బృందం.
“అమ్మమ్మ” గురించి రచయిత మాటల్లో…
ప్రతి వ్యక్తీ తన జీవితంలో అమ్మ అనే పదాన్ని ఎన్నిసార్లు అంటాడో, అనుకుంటాడో, వింటాడో, చదువుతాడో తెలియదు కానీ, నా వరకూ దాదాపు ప్రతిసారీ అమ్మతో పాటు స్ఫురించేది ’అమ్మమ్మ.’
అర్థం చేసుకోలేని ఆ ప్రత్యేకత అమ్మమ్మ దగ్గర ఏముందో!
అందరు అమ్మమ్మలు అలానే ఉంటారా లేక మా అమ్మమ్మే అలా ప్రత్యేకమా?
ఎన్నో శిశిరాలని దాటుకుంటూ వచ్చిన వసంతంలా, మరెన్నో చీకట్లను చీల్చుకుంటూ, వెలుగులు విరజిమ్ముతున్న విహంగంలా, కల్మషంలేని అమ్మమ్మ చిరునవ్వు ఓ నమ్మకాన్ని ఎప్పుడూ వెలిగించేది.
అమ్మమ్మ లేదనుకుంటేనే, ఆనందంగా మొదలైన బాల్యం అకస్మాత్తుగా ఆవిరయ్యిందని అనిపిస్తుంది.
CLICK HERE TO DOWNLOAD “AMMAMMA” E-BOOK
*****