ద్వారం వారి ‘అపస్వరం’

  మహనీయుల మనస్సులో, మంగళమయ వాక్కులో యావత్కాలానికి ఉపదేశప్రాయమైన మహితసందేశం ఉంటుంది. అంతర్జాలంలో ఒకరోజు పూజ్యులు వాయులీన మహావిద్వాంసులు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి చిత్రాన్ని చూసినప్పుడు ఎన్నడో చిన్ననాడు విన్న ఈ ఉదంతం గుర్తుకు వచ్చింది: విజయనగరంలో అతినిర్ఘృణుడైన…

ఢిల్లీ – తెలుగువారి చైతన్యదేహళి

ఈ యమునాతీరంలో వీచిన సుకవితా సంగీత నాట్య కళాసమీరాలను, ఇక్కడి చరిత్ర విధాతలైన మహనీయ వ్యక్తులను, అసామాన్య సామాన్యులను, స్మరణీయ సంఘటనలను, తెలుగువారు ఉనికికోసం, మనికికోసం ముచ్చటపడి నిర్మించుకొన్న సంస్థలూ సమాఖ్యల చరిత్రలను, ఆ ఆత్మీయతలను, ఆ జ్ఞాపకాల ఛాయాచిత్రాలను, ఉక్తిప్రత్యుక్తులను, సూక్తిరత్నాలను, చిత్రోక్తులను, ఛలోక్తులను, ఆశలను, ఆశయాలను, ఆదర్శాలను మరీ మరీ నెమరువేసుకోవా లనిపించి, స్మృతిసరస్సులో వికసించిన అనుభవ లీలాకమలాల సుగంధాన్ని నాకు పరిచితమైనంతలో శ్రుతపాండిత్య వాక్స్రవంతిగా మిత్రులందరికీ ఒక్కొక్కటిగా పంచిపెట్టా లనిపించి మనస్సంతా మాధుర్యభావంతో నిండిపోతుంది నాకు.