ఛలో భరతఖండ్ – ఆర్యుల వలస సిద్ధాంతం – ప్రస్తావన

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4.5]

ఛలో భరతఖండ్ – ప్రస్తావన

Aryan Migration Theory Review by Ravi ENV


ఈ వ్యాసాన్ని వీడియో పాడ్కాస్ట్ గా అన్వేషి ఛానల్ లో వినడానికి ఈ లింక్ క్లిక్ చేయండి


ఇద్దరు మిత్రులు – ఆర్యులు – వలసలు

 

“ఏరా? సమ్మర్ లో టూర్ ఏదో ప్లాన్ చేస్తన్నట్లున్నావ్?

“యా! లడఖ్ కు ప్లాన్ చేస్తున్నారా. లేహ్, ఖార్దుంగ్ లా, నుబ్ర వేలీ, ఆపైన తుర్తుక్, పాంగోంగ్….”

“ఆహా, బావుందిరా. ప్యాకేజీనా?”

“అవున్రా! నుబ్రా నుండి లడఖ్ లో చిట్టచివరి బాల్టిక్ గ్రామం తుర్తుక్ మాత్రం కంఫర్మ్ లేదట. ఆ దారి సంవత్సరం లో ఒకట్రెండు నెలలే సరిగ్గా ఉంటది. మిగతా టైం అంతా కొండచరియలు, మంచు కరగటం, రోడ్లు బ్లాకు వగైరా వగైరా. అస్సలు పోలేమట.” అన్నాడు వాడు.

“ఒహ్. సరే” అన్నాను.

కాసేపటికి టాపిక్ మారింది.

మాటల్లో ఆర్యుల వలస మీద వాడొక రీసెర్చ్ బుక్ రాస్తున్నానని చెప్పాడు.

“సూపర్. మాంఛి గిరాకీ రా. కొంచెం పబ్లిసిటీ తెచ్చుకుంటే చాలు.” అన్నాను.

“ఏదో ట్రై చేస్తున్నా రా. అవునూ, నీకు ఈ థియరీ పడదు కదా?” సందేహంగా అడిగాడు వాడు.

“పడడం, పడకపోవడం ఏం లేదురా. కాపోతే నాకొచ్చే డవుట్లకు …వద్దులే..”

“డవుట్లా? ఒకటి వదులు?”

“లక్షలాది ఆర్యులు గుర్రాల్లో, రథాల్లో ఎగేస్కుంటూ భరతఖండానికి వచ్చేసారు కదా! వారికి ఆ తుర్తుక్ దారి టైపు లో అడవులు, ఎడారులు, కౄరమృగాలు, కొండచరియలు, మంచు, హిమానీ నదాలు – ఇలా ఏడాది పొడుగూతా మూతపడిన దారులు తగిలే ఉంటాయి కదా. అదీ కాక అది క్రీ.పూ. 1500. క్రీ.శ. 2024 లోనే నువ్వు, నీ ఫేమిలీ తుర్తుక్ కి చక్కగా Border Roads Organisation వాళ్ళేసిన తార్రోడ్డు మీద 4 వీల్ డ్రైవ్ కారులో కూడా వెళ్ళలేకున్నావు. అలాంటి క్రీ.పూ. 1500 లో గుర్రాలు కట్టిన రథాల్లో లక్షలమంది ఎలా వచ్చారంటావ్? భరత్ భరో లేదా ఛలో భరత్ ఖండ్ ప్రోగ్రాం ఎలా పెట్టారంటావ్?”

అవతలి వైపునుండి వెంటనే సమాధానం రాలేదు.

నేనూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను.

నిముషం కావొస్తోంది. అయినా అట్నుంది ఉలుకు పలుకు లేదు.

నా అనుమానం నిజమైతే మా వాడు సిగ్నల్ దొరకనట్టు గానీ, లేదా ఇంకొక కాల్ వస్తున్నదని కానీ డ్రామాలు మొదలెట్టాలి.

ఊహించింది కరెక్టే.

“హలో…హలో.. వినబడతోందా?”

“ఆ ఆ వినబడుతోంది. జవాబు చెప్పు.”

“హలో…హలో…థూ వెధవ సిగ్నలు…” అన్న మా వాడి సణుగుడుతో వెంటనే ఫోన్ కట్ అయింది.

*****

వాస్తవం

 

చదవటానికి ఏదో ప్రహసనం లా ఉన్నా, ఆర్యవలస సిద్ధాంతం విషయం లోనూ జరుగుతున్నదదే.

ఎప్పుడో క్రీ.పూ. 1500 ప్రాంతంలో ఆర్యులనబడే “తెల్ల జాతి” వాళ్ళు రథాలు గుర్రాలు వేసుకుని గుంపులు గుంపులుగా భరతఖండంలో జొరబడి, అదివరకు స్థానికంగా ఉన్న నాగరకతను ధ్వంసం చేసి, వారిని యెకాయెకి ద్రవిడనాటికి తరినివేసినట్టు మన చరిత్ర పుస్తకాల్లో ఉంది.

అంతకన్నా అసహ్యంగా, పిల్లలు నేర్చుకునే పాఠ్యాంశంగా ఈ అబద్ధం స్థిరపడి ఉంది.

అంతకన్నా రోత – ఇప్పటికీ స్వార్థపరులు ఎందరో, ఈ అసహ్యమైన సిద్ధాంతాన్ని నమ్ముతూ నమ్మిస్తూ, పబ్బం గడుపుకుంటున్నారు.

ఈ సిద్ధాంతం పై ఇప్పటికీ పుస్తకాలు వస్తున్నవి.

దీని తాలూకు ఖండన ఈ వ్యాసపరంపర.

*****

 

కొసమెరుపు

మా వాడి పుస్తకం విజయవంతంగా లాంచ్ అయింది.

మాంఛి సేల్స్ కూడా.

ఆ సభకు నేను పిలువబడలేదు…యాదృచ్ఛికంగా.

ఎందుకో మీకు తెలిసిపోయిందనుకుంటాను!

 

*****

vijayanagara empire history videos

Don’t miss to watch this thrilling account on ANVESHI CHANNEL

 

 

Your views are valuable to us!