ఛలో భరతఖండ్ – ఆర్యుల వలస సిద్ధాంతం – వేదాలకు అపార్థాలు

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 5]

ఛలో భరతఖండ్ – ఆర్యుల వలస సిద్ధాంతం – వేదాలకు అపార్థాలు

Aryan Migration Theory Review by Ravi ENV


మొదటి భాగం చదవడానికి ఇక్కడ నొక్కండి


 

ఈ వ్యాసాన్ని వీడియో పాడ్కాస్ట్ గా అన్వేషి ఛానల్ లో వినడానికి ఈ లింక్ క్లిక్ చేయండి


ఉపోద్ఘాతం

“సంగచ్ఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతామ్ |
దేవా భాగం యథా పూర్వే సంజనానా ఉపాసతే ||

సమానో మన్త్రః సమితిః సమానీ
సమానం మనః సహా చిత్తమేషామ్ ||”

“కలిసి నడుద్దాం. కలిసి మాట్లాడదాం. కలిసి అభిప్రాయాలు పంచుకుందాం. ఎలా అయితే దేవతలు తొల్లి తమ హవిస్సుల్ని సమానంగా పంచుకున్నారో అలాగే ఐకమత్యం చూపుదాం.

మన కూటమి, ఉమ్మడి ఆలోచన, మన చిత్తాలు ఏకాభిప్రాయాంతో ఉండాలి. “

****

ఫోన్ విచిత్రంగా కూసింది. వాట్సాప్ కూత అది.

కాల్ చేసింది ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ స్నేహితుడు.

ఏదో ప్రెజెంటేషన్ కోసం వేదవాక్యాలు కొన్ని కావాలని, కాంటెక్స్ట్ చెప్పి అడిగాడు.

నిజానికి అవి చెప్పే తాహతు నాకు లేదు.

యాదృచ్ఛికంగా అప్పుడే పుల్లెల రామచంద్రుడు గారు వ్రాసిన “హిందూయిజం” అన్న వ్యాసం చూస్తుంటే పాడ్కాస్ట్ ప్రారంభంలో చెప్పిన వాక్యాలు కనిపించాయి. అవే వ్రాసి పంపాను. అవి అతనికి ఉపయోగపడివుంటాయని అనుకుంటాను!

విజయనగర సామ్రాజ్య చరిత్ర vijayanagara empire history in telugu

****

కాల్ ముగిసిన తర్వాత ఆలోచనలో పడ్డాను.

“అతను నన్నే ఎందుకు వేదవాక్యం కోసం అడిగాడు?”

మనకు సంస్కృతం తెలిసిన వ్యక్తి తెలిస్తే అతడితో బహుశా మనం ఇవే అడుగుతాం. ఒక పండితుడు ఎవరన్నా కనిపిస్తే అతని పాండిత్యంలో మనకు ఒక సమాధానం దొరుకుతుందనుకుంటాం. అది సహజం.

అయితే, చాలా విచిత్రంగా, ఒక సబ్జెక్ట్ చదువుకుని, ఆ సబ్జెక్ట్ ను దాని నేపథ్యంతో, దానికి ఉన్న సెన్సిబిలిటీస్ తో కాక, విచిత్రమైన దృక్పథంతో చూస్తారన్నది నాకు ఈమధ్య తెలిసింది.

అలా ఒక విషయాన్ని ఇంకొక పర్స్పెక్టివ్ లో చూసే వారిని రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకరు లింగ్విస్టులు. రెండు కమ్యూనిస్టులు.

ఈ ఇద్దరికీ కామన్ లక్షణం ఏమంటే – వీరికి “సత్యం” అన్నది ముందుగానే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ సత్యం అంటే విశ్వజనీనంగా నిరూపణ అయిన యూనివర్సల్ ట్రూత్ కాదు. వారి ఆలోచనకు అనుగుణంగా వారే తీర్మానించేసినదాన్ని ఇతరుల అభిప్రాయాలతో పనిలేకుండా సత్యం అని పిలుచుకుంటారు.

సదరు సత్యం వెనుక సైద్ధాంతిక నేపథ్యం కూడా స్థిరపడిపోయివుంటుంది. ఆ నేపథ్యం వెనకున్న ఆలోచనా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది. ఆ అలోచన చాలా ఉదాత్తమైనదని కూడా వారు నిర్ధారించేసివుంటారు. ఈవిధంగా అటు లింగ్విస్టులకు, ఇటు కమ్యూనిస్టులకు –

  • సత్యం అని వాళ్ళు అనుకున్నది తెలుసు.
  • దానికి గల సిద్ధాంతమూ తెలుసు.
  • దానికి ఉన్న ఉదాత్తగుణమూ తెలుసు.

వారు ఏది చదివినా తమ లింగ్విస్టిక్ లేదా కమ్యూనిస్ట్ మూసల్ని ఆ చదివిన దానికి అంటించి వ్యాఖ్యానించడం చేస్తారు.

ఇలాంటి కువ్యాఖ్యానాలకు మూలం అదీ ఇదీ అని లేదు. వేదం, చరిత్ర, పాశ్చాత్య పరిశోధనలు ఏవన్నా కావచ్చు గాక.

ఋగ్వేదంలో ఒక ఋక్కు ఇలా ఉంటుంది. “గౌరిమిమాయ సలిలానిషత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ …

వేద భాష్యాలలో ఈ ఋక్కుకు అమోఘమైన అర్థాన్ని వివరించారు భాష్యకారులు.

అంతే కాదు, ఈ శ్లోకం దాదాపు అన్ని హిందూ క్రతువుల్లోనూ ప్రధానంగా వినవస్తుంది.

అటువంటి ఉత్తమమైన ఈ శ్లోకాన్ని రాల్ఫ్ గ్రిఫిత్ అనే పాశ్చాత్యుడు “నాలుగు పశువులు నీళ్ళల్లో దిగి ఆడుకున్న జలకాలాట” గా అర్థం వ్రాశాడు.

ఇండియన్ లింగ్విస్టులకు ఈ రాల్ఫ్ గ్రిఫిత్ ఆరాధ్య దైవం!

హిందూ మతం తాలూకు ఒక ఉదాత్త విషయాన్ని అదివరకు భాష్యకారులెవ్వరూ చెప్పని విధంగా కువ్యాఖ్యానం చెయ్యడం లింగ్విస్టుల దృష్టిలో “సత్యమే”. ఎందుకంటే అది వారు అంతకు మునుపు ఏర్పరుచుకున్న ఆశయాలకు, లక్ష్యాలకు దోహదపడుతుంది గనక.

అలా కువ్యాఖ్యానం చెయ్యడం వలన ఒక జాతి కొన్ని వేల ఏళ్ళుగా మౌఖికంగా, ఆ తర్వాత పారంపరికంగా, క్రతువుల్లో, స్వాధ్యాయంలో, అలానే కొంత రూపు మార్చి పురాణాల్లో – ఎంతో విలువైనది నిలుపుకున్నదాన్ని – హేయమైనది, అనాగరికమైనది, సంస్కారం లేని ఆటవిక జాతి మూలాలు గలదిగా ముద్ర వేసినట్లవుతుంది.

అయితే లింగ్విస్టులకు అదేం కాబట్టదు. వారికి ఎదుటి వారి సంవేదనల కన్నా, తాము సత్యమని అనుకున్నదే ముఖ్యం కనుక.

*****

కమ్యూనిస్ట్ దృక్పథం

 

సరిగ్గా కమ్యూనిస్టుల దృక్పథమూ ఇదే.

“ఫలానా ఆయన గొప్ప సంస్కృత పండితుడు. వారి తండ్రి పురాణాలను అనువదించాడట!” అని ఒక ఆయన గురించి కొందరు మిత్రులు ఆఫ్ లైన్ లో చెప్పారు.

ఆ పేరు మోసిన సంస్కృత పండితుడు ఓ కమ్యూనిస్ట్.

ఇలాంటి పెద్ద పేర్లు నాకు ఏనాడూ ఆసక్తి కలిగించలేదు. కలిగించవూ కూడా.

ఆయనకు ఋగ్వేదం అంటే – “సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం”, ” పశ్యేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, అజీతా శ్శ్యామ శరదశ్శతం”, “సహనా అవతు సహ నౌ భునక్తు” ఇలాంటి ఏవీ కాదు.

ఆయనకు ఋగ్వేదం అంటే ’ఓ వలస వారసత్వపు ఒకానొక లాగ్.

అందులో ఇంగ్లీషు ముక్కలు వెతకడం ఆయన దృష్టిలో ఉదాత్తమైన విషయం.

చాలా చిత్రమైన విషయం ఏమంటే – ఆయనకు పాశ్చాత్యులకు ఉండే వాస్తవిక దృష్టి కూడా లేదు.

జన్యుపరిశోధనల మీద పాశ్చాత్యుల పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఆ పరిశోధనల్లో ఏకాభిప్రాయం ఇప్పటి వరకూ కుదర్లేదు. వాళ్ళు పరమప్రామాణికుడుగా ఊదరగొట్టే డేవిడ్ రీష్ అనే హార్వర్డ్ శాస్త్రవేత్త పరిశోధనలు కూడా తీవ్రంగా విమర్శింపబడినాయి.

ఆ వాస్తవిక పరిశోధనలను చూచే వాస్తవిక దృష్టి కమ్యూనిస్టులకు, వారి సమర్థకులకూ లేదు.

వారు వాస్తవికత గురించి ప్రశ్నిస్తే – ఆ పరిశోధనల వెనుక “ఏ జాతీ గొప్పది కాదు” అన్న ఉదాత్త సిద్ధాంత నేపథ్యం చిలుకల్లా ఒప్పచెబుతారు.

ఉదాత్తంగా చూడవలసిన ఋగ్వేదంలో పిడకల వేట చేయడం, వాస్తవికతను ప్రశ్నించవలసిన శాస్త్రీయ పరిశోధనలను “ఉదాత్తమైన నేపథ్యం” అన్న షుగర్ కోట్ తో చూడటం – ఈ రెండూ తప్పే.

****

మలి పలుకులు

చుట్టుపక్క సమాజంలో, సోషల్ మీడియాల్లో ఈ విన్యాసాలను చూడాల్సి రావడం ఒక దౌర్భాగ్యం. దురదృష్టం.

అలాగని చూడకుండా ఉండటానికి మనసొప్పదు. ఎందుకంటే వాటిలోని లోపదోషాలను చెప్పకపోతే చదువుకున్న చదువుకు అర్థం లేదని మీమాంస.

మళ్ళీ మొదటికి వస్తే “సంగచ్ఛధ్వం, సంవదధ్వం” – “కలిసి నడవడం, కలిసి అభిప్రాయాలు పంచుకోవడం” అనే ఋగ్వేద బోధనలకు నేటి సమాజంలో స్థానం ఉందా? లేక పూర్వనిర్ధారితమైన, పూర్వాగ్రహపీడితమైన ఆధునిక దాష్టీకమే ప్రధానమా?

ఇది సహృదయులే తేల్చాలి.

*****

తర్వాతి భాగంలో డేవిడ్ ఆంథోనీ అనే ఓ ఆంత్రోపాలజిస్ట్ ఋగ్వేదానికి చేసిన అసంబద్ధమైన అనువాదం, ఆర్యులు ఎవరు అన్నదానిపై అది చూపించిన నెగటివ్ పర్యవసానాల గురించి తెలుసుకుందాం.

*****

stree vijayam history documentary in telugu

Your views are valuable to us!