డైరీ

పూయడం మర్చిపోయిన పూలచెట్టురంగు వెలిసిన సీతాకోకచిలుకరెక్కలుడిగిన పక్షిచెదిరిన మువ్వలుచిట్లిన గాజు పూసలు గల్లంతైన చిరునామా నిట్టూర్పు రొద చివరి పుటలో మాత్రంనిగూఢ రహస్యమొకటినిశ్శబ్దంగా నవ్వుతుంది!

కోడి రామమూర్తి – అబ్బూరి వరద రాజేశ్వరరావుల స్నేహ బంధము

శ్రీకాకుళం వద్ద- వీరఘట్టం గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. సర్కస్ ప్రదర్శనలలో మేటి. కోడి రామ్మూర్తి నాయుడు కలకత్తాలో ప్రదర్శనలు ఇచ్చే వారు. మహా నగరంలో వరుసగా 2, 3 నెలలు ప్రదర్శించేవారు ఆయన. ఛాతీ మీద ఏనుగును ఎక్కించుకోవడము, బలమైన…

కవుల కితకితలు

ఆపరేషన్ థియెటర్ బయటవున్న ఎర్ర లైటు ఆరిపోయింది. చేతులు తుడుచుకొంటూ బైటకొచ్చిన డా. ఆంజనేయులు దగ్గరకు పరుగెత్తివచ్చాడు రామం. “డాక్టర్! మా లక్ష్మణరావు ఎలా ఉన్నాడు? వాడి గుండెలో ఏమైనా…??” “చాలానే ఉన్నాయి. రండి చూపిస్తాను!” అని లోనికి తీసుకెళ్ళాడు డా.…

కొలవరి… కొలవరి…. ఎవరి వెర్రి?

కొలవరి…..కొలవరి….. ఎవరీ వెర్రి?   పిచ్చి పలు విధాలుపిచ్చిలో పలు పదాలుకొలవరి…కొలవరి రకాలు!! కవిత్వమంటే కొందరికి కపిత్వమంటే కొందరికి కొలవరి అంటే కొందరికి తలవలి ఎందరికో?   కై లో గ్లాసు అద్భుత ప్రయోగమైతే గ్లాసిల్ కై అధునాతన ఒరవడి తాగినోడు…

పిచ్చిలో….

నేనో పిచ్చిమొక్కనిరోడ్డు పక్కో, సగం కూలిన గోడ సందులోనో పుట్టుకొస్తా నాలాంటిదే పిచ్చిగాలికొంచెం జోరుగా, కొంచెం తూలినట్లుగా వీస్తాదినేనూ ఊగుతా నా ఒంటరితనం మాయమైపోవడం ఇష్టంలేనిచెయ్యొక్కటి నా గొంతును నులుముతుంది గాలి పిచ్చితోటి నా తలఆ చేతిలో ఊగుతానే ఉంటది

జల్లు

తలపు తడుతూ నేల గంధంతలుపు తీస్తే.. ఆకాశం కప్పుకున్నఅస్థిరమయిన రూపాలుతేలిపోతూ.. కరిగిపోతూ ..అలజడిచేస్తూ..అక్షరాల జల్లు నిలిచే సమయమేది ?పట్టే ఒడుపేది ? పల్లంలో దాగినజ్ఞాపకాల వైపు ఒకటే పరుగు. తడుపుదామనోకలిసి తరిద్దామనో.. గుండె నిండేసరికినిర్మలాకాశంవెచ్చగా మెరిసింది.

చారిత్రక కట్టడాలు

గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాచీన కట్టడాలు కూలిపోతున్నాయి. విగ్రహాలు విరిగిపోతున్నాయి. గత సంవత్సరం మే నెలలో శ్రీకాళహస్తీశ్వరాలయ రాజగోపురం కూలిపోయింది. నిన్న, కుమారస్వామి విగ్రహం విరిగిపోయింది. అధికారుల అలసత్వానికి తోడుగా భక్తుల అత్యుత్సాహం, మితిమీరిన భక్తి తోడవడం…

గాంధీజీ గారి పంచాంగం

కస్తూరిబాయి  (11 April 1869 – 22 February 1944) గాంధీజీ భార్య. మోహన్ చంద్ కరమ్ చంద్ గాంధీ మహాత్మునిగా మారడానికి స్ఫూర్తి ఐనదని చాలా మందికి తెలుసినదే! ఆయన రాజకీయాలను నిర్వహించడంలో గొప్ప సమర్ధత కలిగిఉన్నవాడే! తోటి మనుష్యుల…

హైదరాబాదీ!

”నువ్వు హైదారాబాదీవా!”అంటారు ఎవరోమనసు పులకరిస్తుంది హైదరాబాద్ బతుకు ఆల్బమ్ లోఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటో!ఆల్బమ్ తెరిచినప్పుడల్లామంచు తెరలమధ్య నుంచినగరం చుట్టూతా పారుతున్న దిగులు. రెండుగా చీలిపోతున్ననగరం-ఎలా కలపాలి? కలిసేవుంటూ కలవని నీరెండ.పచ్చని మొక్కలు నాటి ,నగరమంతా ఈ నీడలోనిద్ర పోతుందని…

“వాయుసుత” హనుమంతుడు!

నేడు హనుమజ్జయంతి. కావున ఆ మహాభాగవతోత్తముని గురించి యథామతిగా కొన్ని మాటలు… “రామ” అన్న రెండక్షరాలతో ముక్తి కలిగితే, ఆ ముక్తికి మూల హేతువైన భక్తి సిద్ధించాలంటే “హనుమ” అన్న మూడక్షరాలు అత్యవశ్యకం. “హనుమ” అని పలికితే చాలు మూఢమతికి కూడా…