మన చరిత్ర – కొత్త సిరాతో

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4.5]

 

సెక్యులరిజం” అన్న సిద్ధాంతం వల్లనే దేశంలో మతతత్వం పెరిగిపోతోందని అనిపిస్తోంది. మత సహనం పేరుతో అన్ని మతాల సహనాన్ని ప్రభుత్వం పరీక్షిస్తోందన్నది నిస్సంశయం. విపరీతమైన మౌఢ్యం, చాప క్రింద నీరులా ప్రవహించే తత్వాలున్న కొన్ని మతాలను మాత్రమే సంరంక్షించే విధానంగా మాత్రమే “సెక్యులరిజం” పనిచేస్తోంది.

తస్లీమా విషయం, సల్మాన్ రుష్డీ గొడవ, రామసేతు/రామజన్మ భూమి వివాదాల్ని, శబరిమలపై జరుగుతున్న అనవసర రాద్దాంతాన్ని, ఇంకా ఇలాంటి అనేక గొడవల్ని తులనాత్మకంగా చూసినపుడు ఎవరి నమ్మకాలకు పార్టీలకు అతీతంగా అన్ని ప్రభుత్వాలు ఎవరి విశ్వాసాలకు విలువనిచ్చాయో, ఎవరిని కాల రాచాయో  తేటతెల్లమవుతుంది.

ఇలా నడుస్తున్న చరిత్రలోనే ఇన్ని లోపాలు, లొసుగులు ఉన్నప్పుడు గడచిపోయిన శతాబ్దాల చరిత్రలో ఎన్నెన్ని ఊహాగానాలు పచ్చి నిజాలుగా ప్రచారం చేయబడ్డాయో ఊహించడం కష్టమే.

గొప్ప దేశభక్తుడిగా చెప్పబడుతున్న టిపూ సుల్తాన్ చరిత్రను గమనిస్తే మన చరిత్ర ఎలా వక్రీకరించబడిందో తెలుస్తుంది. మలబారు ప్రాంతంలో అతను సృష్టించిన మత ప్రచోదితమైన అరాచకం ప్రస్ఫుటంగా కనబడుతున్నా కూడా చరిత్రకారులు అతన్ని స్వాతంత్ర్య సమర వీరుడిగా చిత్రీకరించడం నిజాలను ఎద్దేవా చేయడమే. అతను తనని తాను దక్షిణభారత చక్రవర్తిగా భావించుకొంటూ చేసిన అరాచకాలు ఎన్నెన్నో.

హైదరాబాదు నిజాము, ట్రావెంకోర్ రాజు, కూర్గ్ రాజు మొదలైనవారు తన సామంతులుగానే అతను పరిగణించేవాడు. అతను భయపడినది ఒక్క బ్రిటీషువారికి మాత్రమే. అందువల్లనే తన చక్రవర్తిత్వానికి అడ్డు పడగలరనే అభిప్రాయంతో టిపూ వారితో యుద్ధానికి తలపడ్డాడు.

మనం గ్రహించవలసిన విషయమేమిటంటే బ్రిటీషువారితో తలపడిన ప్రతి ఒక్కరూ దేశభక్తులు కాలేరు. స్వార్ధం, స్వలాభం కోసము పోరాడినవారిని దేశభక్తులుగా పరిగణించకూడదు. టిపూ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే బ్రిటీషు దురాక్రమణనాన్ని ఎదుర్కోదలచిన టిపూ తోటి రాజుల సహాయంకాక మరో దురాక్రమణదారులైన ఫ్రెంచువారిని సహాయమెందుకు అర్ధించాడు?

[amazon_link asins=’9352606620,8179306887,9352603451,019568785X’ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’8f4be22f-b0ed-4fd8-8693-04c8d801016d’]

చరిత్రలో మరి కొంత కాలం వెనక్కు వెళ్తే, మొగలాయి రాజుల పాలన కూడా పాఠ్యపుస్తకాలలో గొప్పగా వర్ణించబడింది. తమ మత కట్టుబాట్ల అనుసారంగా జిజియా పన్నును విధించారు మొగలాయి పాలకులు. ఆరవ శతాబ్దంలోని మొగలాయిలు ఆక్రమణ లగాయితు పందొమ్మిదవ శతాబ్దం దాక వారికీ, మనకూ రాజధాని అయిన ఢిల్లీలో ఒక కొత్త హిందూ దేవాలయము నిర్మాణము కాలేదు. ఎందుకు? ఇలా ఏవిధంగా కూడాపరమత సహనాన్ని పాటించని మొగలాయి పాలకుల్ని మన పాఠ్య పుస్తకాలు ఎందుకు కీర్తిస్తున్నాయి?

మరి కొద్దికాలం వెనక్కు వెళ్ళితే మొహమ్మద్ బీన్ తుగ్లక్, అతని తరువాత వచ్చిన ఫిరోజ్ ఖాన్ లు సృష్టించిన అరాచకం ఘోరమైనది. ఫిరోజ్ ఖాన్ ఒక అడుగు ముందుకు వేసి ఢిల్లీలో కొత్త దేవాలయాన్ని కట్టబోయిన ఒక బ్రాహ్మణుడిని బంధించి, తన రాజప్రాసాదము యొక్క వాకిలి వద్ద సజీవంగా దహనం చేయించాడు. ఇది బ్రిటీషువారే వ్రాసిన భారత చరిత్రలో ఉంది.

అంతకు మునుపు ఉండిన అలాదీన్ ఖిల్జి శతృవులైన తోటి మహమ్మదీయుల్నే తీవ్రంగా హింసించడమే కాక మసీదులను తగులబెట్టించాడు. వారి పూర్వీకుల గోరీలను తోడి, అస్తిపంజరాలను బయటకు తీయించాడు.

ఇలా వ్రాస్తూ పోతే, మన చరిత్ర తప్పుల తడకలుగా కనబడక మానదు. సెక్యులరిజం సిద్ధాంతం వల్ల నిజమైన చరిత్రను మనకు మనమే సమాధి కట్టుకోకూడదు.

మన చరిత్రను క్రొత్త సిరాతో వ్రాయవలసిందే.

@@@@@

2 thoughts on “మన చరిత్ర – కొత్త సిరాతో

  1. ఇంకా వ్రాయాల్సింది అని అనిపించింది రఘు గారు. ప్రస్తుత యువతకు ఈ నిజాలు తెలియాలి.

  2. కొత్తసిరా….చరిత్ర లో వ్రాయని నిజాలని వ్రాయవలసినదే

Your views are valuable to us!

%d bloggers like this: