చిగురులు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 
శిశిరం ఒక కొమ్మ లో ఎండిన ఆకుల్ని
చల్ల గాలి హాయిగా కిందకు చేరుస్తుంటే
చోచ్చుకోస్తున్న వసంతం
ఒక కొమ్మ కి చిగురులు తొడుగుతుంది
ఒకే  ఇంట్లో ఒకే సారి జరిగిన 

జనన మరణ సంఘటనలు చూసినట్లుంది
 
చిగుర్లు ముదిరి పచ్చని ఆకులై
వసంత శోభకు తోరణాలు కడుతుంటే
రాబోయే గ్రీష్మం తలపుకు వచ్చి భయపెడుతుంది
మేమున్నామంటూ చెట్లు
గుబురుగా పెరిగి గుబులు తీరుస్తాయి
 
కోయిల పాటలు మామిడి పూతలు
వేప చిగుళ్లూ పూల సుగంధం
స్వపరిబేధంలేని కాల పురుషుని తలపిస్తే 
స్వయంక్రుతాపరధంతో మానవాళి
పచ్చ దానానికి చిచ్చు పెట్టినందుకు
కుంచించుకు పోతోంది
వేసవి వెతలకు సమయత్తమౌతోంది.

Your views are valuable to us!