Like-o-Meter
[Total: 0 Average: 0]
పల్లవి:
కాపురము యన్న కలతలు మామూలే!
అప్పుడప్పుడు గొడవ ఉప్పెనలు మామూలే! || కాపురము ||
అనుపల్లవి:
ఆలు మగల మధ్య అలకలు మామూలే!
కలతలు తీరగ, కలయుట మామూలే! ||కాపురము ||
-
చీటి మాటికి రచ్చ, చిటపటలు మామూలే,అడప దడప అలక అలజడి మామూలే!పడకలు వేరై, పంతాలు మామూలే!వేడి తగ్గినాక ఒద్దిక మామూలే! ||కాపురము ||
-
పెదవి బిగ బట్లు, విరుపులు మామూలే,ఎదలోన తాపము, ఎడబాట్లు మామూలే!మది లోన మధనలు, మమతలు మామూలే!వదలగా పంతము, ఒదుగుట మామూలే! ||కాపురము ||
-
ఆలు మగల మధ్య అక్కరలు మామూలే,కలికి మగని మధ్య కోపాలు మామూలే!ౘలి లోన చెమటలు చిందుట మామూలే!ౘల్లబడి కలయగ చుంబనలు మామూలే! ||కాపురము ||
-
అలమేలు మంగకు అలకలు మామూలే,చిలకల కొలికికి చీకాకు మామూలే!పలకరించగ పడతి పొంగుట మామూలే!ౘలపితి ఒడిలో చేరుట మామూలే! ||కాపురము ||