భోగట్టా

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఉన్నదంతా పాపపుసోమ్మే అని
అందరికీ తెలిసినంతమాత్రాన చెల్లదు
న్యాయస్థానం తీర్పు ఇవ్వాలి
ఈ లోగా అసోమ్మంతా చక్కగా అనుభవిస్తూ
న్యాయం, ధర్మం, చట్టం, నీతి గురించి బోధిస్తూ
నాలుగు చెరగులా విలాసంగా సంచరిస్తుంటే
ఈనాడు శ్రీధర్ బొమ్మలో పేదోడు వాపోయాడు
వాడి కోడీ కుక్క దూడ ఆలి పిల్లలూ వెర్రి చూపులు చూసారు !!
 
***
 
జయ ఇప్పుడు తన ధనకామాన్ని జయిన్చిందట
మాయ బొమ్మలు ఎనుగులేత్తుకొని పోయాయట
మమత ఇంకా రైలు వేగంతోనే పని చేస్తుందట 
ములాయం కొడుకు మైసూర్పా లా కరిగిపోతాడట
 
***
 
2014 ఇంకా చాల దూరముంది
ఈలోగా ఇళ్ళు చక్కబెట్టుకోవాల
మధ్యంతరం ఒక మాయ మాట
అర్ధంతరంగా ఆదాయంలో కోత
 
మనమెంచుకున్న వాళ్ళలో చాల మంది దొంగలే
కొందరు మొద్దు దుంగలు కూడా
మరి కొందరు ఖూనీకోరులు, రౌడీ రాయళ్ళు
వీళ్ళ మధ్య బహు కొద్ది మంది మంచోళ్ళు
వచ్చే లోక్సభ తీరు ఎలా ఉంటుందో
 
***
 
ఇప్పుడు చూడు ఈ ఏడాది
కుప్పలు  తెప్పలుగా ప్రణాళికలు
వందల్లో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు
ఇబ్బడిమిబ్బడి గా కేటాయింపులు
 
ప్రభుత్వంలో అందరూ ఖుష్
సంపాదన అనే పని ఒత్తిడికి లొనై
జనం సొమ్ముతో విదేశీ యానాలు
అబ్బో చాల కమిటీలు, హై టీలు
 
 
 
 
 

Your views are valuable to us!