బడ్జెట్ సుబ్బారావు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఇంటి అద్దెకి కొంత, ఇంటి అప్పుకి కొంత

పప్పుకీ ఉప్పుకీ కొంత, చెప్పుకీ లిప్పుకీ కొంత

మొబైలు బిల్లుకి కొంత, మొబైకు పెట్రోలుకి కొంత

పిల్లల స్కూల్ కి కొంత, ఆదివారం మాల్ కి కొంత

వచ్చే రోగానికి కొంత, చస్తే ఇస్తారని కొంత

వేసవిలో ఊటీకి కొంత, పక్కవాళ్ళతో పోటీకి కొంత

కొంత + కొంత = వచ్చేది చాలనంత.

మిగిలేది లోటు బడ్జెట్ పూడ్చే చింత

 

టాక్సులు కట్టడమే కానీ వెయ్యలేడు

టీవీ చూడటమే ఏమి చెయ్యలేడు.

 

ఉన్న ఉద్యోగం ఊడితే రామ్ రామ్

మిగిలేది నౌకరీ డాట్ కాం

కొలీగుతో కుస్తీ, పైవాడితో దోస్తీ

మనసుకీ, శరీరానికి సుస్తీ.

 

మధ్యలో ఓ ప్రొమోషన్,  పేరుకో ఇంక్రిమెంట్

పర్వాలేదు బానేఉందని ఓ చిన్న సెంటిమెంట్.

ఆశలతో రోజులు, ఊహలతో నెలలు

కార్లు, భవంతులతో రాత్రిళ్ళు కలలు.

  

మరో కొత్త సంవత్సరం, మరో సారి చిదంబరం

పెరిగిన పప్పూ, అరిగిన  చెప్పూ

ఖరీదు ధరల భూతం, మళ్లీ చాలని జీతం. 

 

Your views are valuable to us!