బుగ్గైపోయిన బాల్యం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఎక్కడమ్మా ఆడుకొను?
ఎప్పుడమ్మా ఆడుకొను?
ప్రశ్నలలో మిగిలిపోయిన
బాల్యపు ఆనందం, ఆట పాట

అమ్మ చెంత వెచ్చగా పడుకోలేదు
అమ్మ కథచెప్పి నిద్ర పుచ్చదు
నాన్న తో పార్క్ కి వెళ్ళలేదు
ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఏడు వరకూ
చదువు, చదువు, చదువు

వేసవిలో సైతం యూనిఫారం
బూట్లు బెల్టు, బోలెడు బుక్స్
బాల్యం బడికి వెళ్ళనంత వరకే
మరి ప్రీ-స్కూలు కెళితే ?
బాల్యం మూడేళ్ళ వరకే
సరేనా …..

మరి మూడేళ్ళ నుంచి
భారపు బాల్యం
బాధల బాల్యం
భయంకర బాల్యం
బేల జీవితం

మార్కులు గ్రేడ్లు
టెస్టులు పరీక్షలు
పెద్దలు చేసే కామెంట్లు
తోటి వారి తో ఇక్కట్లు

స్నేహం లేదు సంతోషం లేదు
ఇంటా బయటా పోటీ
నాతొ నాకే పోటీ
ఇలా ఔతున్నా రోజూ లూటీ

***
భాష్యం, బచపన్
వికాస్, విజ్ఞాన్,
శ్రీ చైతన్య, కృష్ణవేణి
నారాయణ, నలంద
ఒకేసారి తగులబడి పోతున్నట్లు
మొత్తం రాష్ట్రంలో అవి లేనట్లూ
నిరవధికంగా స్కూళ్ళన్నీ బందైనట్లూ

అమ్మ వచ్చి గట్టిగా అరిస్తే కల చెదిరింది
కధ మళ్ళీ మొదటికి వచ్చింది
బాల్యం బలియై పోయింది
విద్య పూర్తిగా అమ్ముడై పోయింది
ఒక తరం మోసపోయింది
మన తరం చోద్యం చూస్తోంది!

Your views are valuable to us!