Like-o-Meter
[Total: 0 Average: 0]

మనమేం చేశాం ?
భరతజాతి దాస్య శృంఖలాలు తెంచిన
గాంధీజీని గాడ్సే గుళ్ళకు బలి చేశాం…….
పరదేశ పాలన నుండి విముక్తి పొంది
పరదేశ వనితకు దేశమిచ్చాం….
పనికిరాని వారికి ఓట్లు వేసి
పదవులు ఇచ్చి అందలమెక్కించాం…..
అనైతిక నేతల చేతలలో
నైతిక విలువలు వెతుకుతున్నాం…..
అమరజీవి పొట్టి శ్రీరాముల ఆశయాలకు
అంతిమ సంస్కారం చేసేశాం……..
ఇంతటి ఘనకార్యాలు సాధించిన
మనం చరిత్ర హీనులం కాకేమవుతాం ?
*******

