దొంగలను పట్టుకోండి అంటే…..

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

దొంగలను పట్టుకోండి అంటే…..
 
దొంగలకు నిర్వచనం అడిగారు
దొంగతనాన్ని కూడా నిర్వ”చించా”లన్నారు.
దొంగ దొరికితే కూడా దొంగ అని అనకూడదన్నారు!
దొంగలను వర్గీకరించాలన్నారు!
దొంగలను ఏవరుపడితే వారు పట్టుకోకూడదన్నారు!
దొంగతనం రుజువైనా దొంగతనం చేసిన వ్యకిని బట్టి శిక్ష అన్నారు!
దొంగలకు హక్కులుండాలన్నారు!
దొంగలను కాపాడుకోవలసిన బాధ్యత భారత జాతిపై ఉందన్నారు!
దొంగలే లేకుంటే పోలీసులు నిర్వీర్యమౌతారన్నారు!
దొంగలే అభివృద్ధి కి మూల కారణమన్నారు!
 
దొంగలను పట్టుకుంటే లక్షల్లో జనం ఉపాధిని కోల్పోతారన్నారు!
దొంగలను పట్టుకోమ్మనేవారు జాతి వ్యతిరేకులు అన్నారు!
అన్నాను తీహార్ జైలు కు తరలించారు!!

Your views are valuable to us!