ఇది చాలదా ఇదవడానికి!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

వచ్చే నాలుగొందల వృద్ధాప్యపు పెన్షన్లో
రెండొందలు లంచం
సర్కారు హాస్టళ్ళలో
“పందులు తినే” ఆహారం
చలికి దుప్పట్లు కూడా ఇవ్వని
చచ్చి పోయిన ప్రభుత్వ పాలనా యంత్రాంగం
ఆరోగ్యశ్రీ ఎంతమందిని శ్రీమంతుల్ని చేసిందో
బలిసిన రైతుకి కూడా రాయితీ, రుణ మాఫీ ఇంకా ఉచిత విద్యుత్తు!
ఎన్నికలపుడు ఎరగా సంక్షేమ పధకాలు
గద్దెనెక్కాక గెద్దలుగా మారి పధకాలను  తమ కాళ్ళతో తన్నుకుపోయి
మళ్ళీ ధనవంతులకిచ్చే ప్రభుత్వ పాలన
ప్రాజెక్టుల పేరుతొ పెట్టుబడిలేని లాభాల వేట
కాంట్రాక్టుల పేరుతొ కమీషన్ల కమామిషు
ఎలా సమస్యల్ని కొన్ని దశాబ్దాల పాటు అపరిష్కృతంగా ఉంచాలో తెలియాలంటే
సంప్రదించండి : భారత రాజకీయ నాయకులను, ప్రభుత్వ అధికారులను
మేరా భారత్ మహాన్!
ఆమ్ ఆద్మీ కా జిందగీ పరేషాన్ !!
ఏమి సాధించాం అంటే మౌనంగా సమాదానమిస్తాయ్
వాడ వాడలా నిలిపిన గాంధిజీ, అంబేద్కర్ విగ్రహాలు
మరచా,  వై ఎస్ ఆర్ వి కూడా!!

Your views are valuable to us!