Like-o-Meter
[Total: 0 Average: 0]
నాన్న అనవసరంగా అమ్మను విసుక్కుంటే భయం
అమ్మ అనవసరంగా నాన్నను దెప్పి పొడుస్తుంటే సందేహం
అమ్మ నాన్న చక్కగా ద్వైత అద్వైతాలగురించి మాట్లాడుకుంటే ముచ్చట
నన్ను చెల్లినీ దగ్గర చేర్చుకొని ముద్దు మాటలు చెబుతుంటే హాయి
ఏది శాశ్వతం కాదు అనిపించిసినా అమ్మ నాన్నల ప్రేమ మాత్రం శాశ్వతం
ఇంట్లోనే జీవితం గురించి పాఠాలు అన్నీ నేర్చుకోవచ్చు అమ్మ నాన్నలను చూసి
పెళ్ళికాని యువత పెళ్ళైన తరువాత జీవితంపై లైవ్ షో ఇంట్లోనే చూడవచ్చు
పెళ్ళికాని యువత పెళ్ళైన తరువాత జీవితంపై లైవ్ షో ఇంట్లోనే చూడవచ్చు
వాళ్ళ వైవాహిక జీవితానికి పునాదులు వేసుకోవచ్చు
ఇంట్లోనే పెరగాలందరూ
మన ఇళ్ళే మన సమాజానికి పునాది రాళ్ళు
మన ఇళ్ళే మన సమాజానికి పునాది రాళ్ళు
కుటుంబమే ప్రేమకు పాఠశాలా
అమ్మ-నాన్నే సనాతన, సమకాలీన గురుస్వరూపాలు