జయ విజయీ భవ!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

పల్లవి:

జయ నామ వత్సర చైత్ర పాడ్యమి వచ్చె,
జయ, విజయ సేవితుని అభయము తెచ్చె. ||జయ||

అనుపల్లవి:

హయగ్రీవ కరము అఙ్ఞానము తృంచి,
హాయిగ ఉండమని అందరిని దీవించె. ||జయ||

భయ భవ సాగర భీకర యాత్రలో ,
మాయలో కొట్టుకొను మానవ జన్మకు,
చేయూత నిచ్చి చింతలన్నీ తీర్చి,
తోయజాక్షుని కరము తీపి నందించె. ||జయ||

కాయ, మానసిక కఠిన బాధలు తీర్చి,
నయగార లోకపు సర్వ భోగము లిచ్చి,
ఆయురారోగ్య, ఐశ్వర్య, సుఖములు,
నయముగ నివ్వను నరహరి కర మొచ్చె. ||జయ||

అయాస పడు జేయు ఆశలు తెగ తృంచి,
రాయి లాంటి ఎదలో కరుణ రసము నింపి,
హేయ భావముల కలుషము తొలగించి,
జయము లందించను జయలక్ష్మి పతి వవ్చె. ||జయ||

కయ్యముల నెల్లా నెయ్యములుగ మార్చి,
వియ్యములు గైకొని వర్దిల్లగ జెప్పి, అ
క్షయముగ వరము లందరికి పంచను,
రయముగ తిరుమల కటి హస్త ము విచ్చే. ||జయ||

Your views are valuable to us!