Like-o-Meter
[Total: 0 Average: 0]
జయలలితకు జయం లాలిత్యం సమపాళ్ళలో ఉండాలని
ఆ రంగనాథుని అర్థిద్దాం రండి తమిళ సోదరులార
పగ, సంపాదన, పట్టింపులు, నిరంకుశ ధోరణులు
ఇవే ముఖ్యమని అనుకుంటే చరిత్రే సాక్షెం రాజకీయ నేతలకు
నేను ఇప్పుడే, ఇక్కడే మరణిస్తే?
నన్ను ఎలా గుర్తుకు తెచ్చుకుంటారు?
రేపు మాత్రమే కాదు కొన్ని ఏళ్ల తరువాత్ కూడా?
నేను నా తమిళ ప్రజానీకానికి చేసిందేమిటి?
నేను ఎన్ని కుటుంబాలను ఆదుకున్నాను?
ఎంత మంది మహిళలకు సాయం చేసాను?
ఎందరు బాలికలు బడులకు వెళ్లి చదువులు నేర్చారు?
నా పదవి ఎందరి వదనాలను వికసింపజేసింది?
ఈ ప్రశ్నలకు సమాధానం జయలలిత కు
జయాన్ని లాలిత్యాన్ని సమపాళ్ళలో ఇస్తుంది