Like-o-Meter
[Total: 0 Average: 0]
కాలాన్ని కరిగించి
కాలం చిక్కలేదని
కాకి గోల చేస్తే
కరుణించేదెవరు?
రహదారుల పై కూడళ్ళ వద్ద
కుంటుతూ సాగిపోయే ఖరీదైన కార్లు
ప్రమాదకర వంకర్లు తిరుగుతూ ద్విచక్రచోదకులు
కాలాన్ని వివిధ రీతుల వెచ్చిస్తూ వ్యధ చెందుతున్నారు
జీవితం లో సింహభాగం పనికే
అందులో పావు భాగం ప్రయాణానికి
వెరసి మొత్తం పగటికాలం ఖర్చై
నిశాచరులుగా మారి నీలుగుతున్నారు
కాలానికి పరమ శత్రువు అభివృద్ధి!
కసితో కాలాన్ని కాలరాస్తుంది నవ్యత
నాయకులు కాలానికి నయవంచకులు
విజ్ఞానం కాలానికి వినాశకారి
వ్యాపారమంతా కాలంతోనే
జీవన వ్యవధి వ్యయమే పెట్టుబడి
అన్నీ వనరులే ఒక్క కాలం తప్ప
మానవజాతి కాముకత మాత్రం కాలాతీతం