Like-o-Meter
[Total: 0 Average: 0]
కొలవరి…..కొలవరి….. ఎవరీ వెర్రి?
పిచ్చి పలు విధాలు
పిచ్చిలో పలు పదాలు
కొలవరి…కొలవరి రకాలు!!
పిచ్చిలో పలు పదాలు
కొలవరి…కొలవరి రకాలు!!
కవిత్వమంటే కొందరికి
కపిత్వమంటే కొందరికి
కొలవరి అంటే కొందరికి
తలవలి ఎందరికో?
కై లో గ్లాసు అద్భుత ప్రయోగమైతే
గ్లాసిల్ కై అధునాతన ఒరవడి
తాగినోడు గ్లాసు పట్టుకోబోయి
గ్లాసు లోనే చెయ్య పెడతాడు
యూట్యూబులో జనాలు
అదే పనిగా హిట్లు కొడతారు
యూట్యూబులో జనాలు
అదే పనిగా హిట్లు కొడతారు
తాగకుండా తాగినట్లు వ్రాస్తే
కై లో గ్లాస్ కరెక్టు
కానీ కరెక్టుగా వుంటే హిట్లొస్తాయా?
కానీ కరెక్టుగా వుంటే హిట్లొస్తాయా?
లోకానికి తాగకుండా తాగినట్లు ఉండాలి
కవిత్వం లాటి కవిత్వం కావలి
పాట లాటి పాట వినాలి
బతుకు లాటి బతుకు బతకాలి
కొలవరి… కొలవరి…. ఎవరి?