Like-o-Meter
[Total: 0 Average: 0]
పలికెను నాకు స్వాగతము
నే పరవశమైతి క్షణక్షణమూ
ఆశలే మల్లెలై విరియగా
హృదయమే కోకిలై పాడగా
సిందూరమే నేనవ్వనా – అందాల నీ నుదిటిపై
సిరిమల్లెనె నేనవ్వనా – నీ నీలిముంగురులలో
అంతరంగం అల్లేనే
ఆలోచనలా పొదరిల్లు
మెరుపును నేనవ్వనా – నల్లని నీ కళ్ళలో
చిరునవ్వు నేనవ్వనా – పూలేత నీ మోవిపై
కొంటె తుమ్మెదలా కనులు
మన్మధ చాపాలా నొసలు
తారక నేనవ్వనా – నీ చిన్ని నాసికపై
భావాన్ని నేనవ్వనా – తీయని నీ మాటలో
భావమెంతొ మధురములే
కోటి వీణల సరిగమలే
పయ్యెద నేనవ్వనా – వయ్యారి నీ మేనిపై
గీతను నేనవ్వనా – పిడికిటి నీ నడుముపై
మదిని నిండే కోరికలే
మధుర భావ వీచికలే
గాజులు నేనవ్వనా – నీ కరకమలాలపై
అందెలు నేనవ్వనా – నీ పాదపద్మాలపై
నిండు పున్నమి రాతిరులు
నిదురను దోచే స్వప్నాలు
*******