మంచి అయ్యకు మంచి ఆలి!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఈ మధ్యన  నేనొక వివాహానికి వెళ్ళాను.

వధువు కుందనపు బొమ్మ. మనసు వెన్న ముద్ద. ఆనందం ఆమె మోములో మెరిసే  ఒక ఆభరణం.


కొంచం పరిచయం ద్వారా తెలుసు. అన్నం అంతా పట్టి చూడాలా?

వరుడు – ముభావి, అభావి. ప్రేమను కళ్ళలో కూడా చూపించలేడు. ఇది సహజంగా సాధ్యమయ్యేది కూడా! అయినా అసాధ్యమతనికి. ప్రేమించడం ఇతనికి అసాధ్యమా అనే అనుమానం.


 
డబ్బు, ఉద్యోగం, లాభం, నష్టం – ఇవే జీవన పరమార్ధం అని ప్రస్ఫుటంగా తెలియ చేసే ప్రవర్తన.

నవ్వు ఎప్పుడూ కొని తెచ్చుకోనేదే. హాస్యం జీవితంలో అవసరం లేదనే భావన.

ఇక ఆ అమ్మాయి సమాధాన పడిందో ? సమతౌల్యత కోల్పోయిందో? సహజీవనం మాత్రం ప్రారంభించింది. పెళ్లి వేదిక పైన ఇదంతా తన ముఖంలో చూపుతూ
 
పిల్లలను – ముఖ్యంగా ఆడ పిల్లలని కనగానే సారిగాదు. అలుపెరుగని ప్రయత్నం చేసి ఒక మంచి అయ్యకు ఆలిని చెయ్యాలి.

 

Your views are valuable to us!