“కోతులు కొమ్మల్నే ఎందుకెంచుకుంటా”యని నేనడిగితే “కోతల కోస”మని బాబాయ్ చెప్తాడు. “కోతలంటే యేమి”టని మళ్ళీ అడిగితే “కోతులు మాత్రమే చేసేపనం”టాడు. “అసలింతకీ కోతులంటే యేమిటని?” వెంటబడ్తే “తెల్సిన విషయాల్ని తెలియని వాళ్ళకి తెలిసీతెలియని రకంగా చెప్పు కొసేవాళ్ళ”ని చెప్పాడు బాబాయ్. “యీ పితలాటకమంతా యేమిటని?” గాట్టిగా నిలవేస్తి అడిగితే ముసిముసిగా నవ్వేస్తాడు.
“యీ బాబాయిలున్నారే వీళ్ళు ’దుబాయి’లని” నాన్నారు అనేసేసారు. నే వెంఠనే “దుబాయని యెందుకన్నా”రని అడిగేసేసేసాను. దానికి నాన్నారు “దుర్మార్గపు బాబాయి”లని చెపేసేసి చక్కా పో యేసారు. బాబాయేమన్నా చమక్కు వేసేస్తే దానికి విరుగుడుగా చురుక్కులేసేయ్యడం నాన్నారి అలవాటు. యింత యింత మాటలు ముంతలు దాటినా అసలు విషయం మూతబడిపోయిందని నాకు మాయిదిగా వుండిపోయేసింది.
మీ కెవరికైనా నా ప్రశ్నకి జవాబు తెలిస్తే చెప్పేసేగల్రు.