Like-o-Meter
[Total: 0  Average: 0]
 
నిరీక్షణ
నిరంతర నిరీక్షణ
అనంతమైన నిరీక్షణ
రైతన్న నిరీక్షణ
కంటిలోని తడి ఆరినా
ఆశల జడి ఆగక నిరీక్షణ
సూటిగ సూర్యకిరణాలు ధాటిగా గుచ్చుతున్నా
చేతిమాటుగా నింగికేసి నిరీక్షణ
బీటలు వారిన భూమిపై చతికిలబడి
తొలకరిజల్లులకై నిరీక్షణ
మృగశిరకార్తెలో వడగాడ్పులలో
వడలిన వదనాలతో నిరీక్షణ
రైతన్నా నీ నిరీక్షణ
నిస్వార్ధ నిరీక్షణ
కావలె నీ నిరీక్షణ సఫలం
మా జీవం ఫలించిన నీ నిరీక్షణా ఫలితం
 **********

                                            