ఓ అందమైన ఎన్ని’కల’

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 3]

ఆవకాయ మ్యూజింగ్స్ – అందమైన ఎన్ని’కల’


అక్టోబరు 2023.

చాగల్లు

అవే రోడ్లు, అదే మురుగు, అదే చెత్త.

ఏమీ మారని ప్రభుత్వ ఉద్యోగులు.

అదే లంచం, ఉచితాలు ఇచ్చిన స్కీములు.

ఇది చూసి వేసారిపొయిన కొందరు యువకులు 2024 లొ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధులుగా పొటీ చెయాలని నిర్ణయించుకున్నారు.

వీళ్ళు 1980 బేచ్ పదో తరగతి విద్యార్థులు.

తెలుగు దేశం, జనసేన, జగన్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూలంకషంగా చదివి, వాటిలో ప్రస్తావనే లేని విషయాల పట్ల సుదీర్ఘంగా చర్చ మొదలుపెట్టారు.

మొత్తం 8 నియోజకవర్గాలలో పోటీ చేద్దామని నిర్ణయం తీసుకున్నారు అవి:

ఉంగుటూరు
దెందులూరు
ఏలురు
పోలవరం
చింతలపూడి
కొవ్వూరు
నిడదవొలు
గోపాలపురం

వారు ఎంచుకున్న వ్యూహం ఒకటే:

1.అభ్యర్థి వ్యక్తిత్వం పై విస్తారమైన వివరణ.
2. అసలైన అభివృద్ధి అంటె ఏమిటి అనే సత్యం తెలియ చెప్పడం – ప్రతి మనిషీ అభివృద్ధి చెందితేనే అది అసలైన అభివృద్ధి.
3. మురుగు, దొమలు, వీధి కుక్కలు, పందులు లేని స్వచ్ఛమైన నివాస వాతావరణం కోసం అడుగులు వేయడం. చెరువులు, బావులు, ఇంకుడు గుంతలు, కాలువలు, మొదలగు సమస్త నీటి ఒనరులను పరిశుభ్రంగా ఉంచడం. గో రక్షణ 100% కల్పించడం.
4.నియోజకవర్గంలో ఉన్న అందరు ప్రభుత్వ ఉద్యొగులూ జవాబుదారీతనంతో పనిచేసేలా చేయడం.
5. అవినీతి, బంధుప్రీతి, లంచం లేని ప్రభుత్వ సేవలు ఇప్పించడం.

ఈ 5 అంశాలే పంచ ప్రాణాలుగా తమ ఎన్నికల మేనిఫెస్టోను సప్రమాణంగా వివిధ విశ్లేషణలతో గణాంకాలతో రూపొందించడం. అందుకోసం ఉన్న కాలాన్ని సక్రమంగా వినియోగించుకొని ఇది సాధ్యం అని నిరూపించి ఎన్నికల బరిలో దిగడం.

ఈ ఆలోచనలతో నిత్యం ఈ 1980 బేచ్ లొ ఉన్న మొత్తం 20 మంది వారి నెట్వర్క్ లో దేశ విదేశాలలో ఉన్న మిత్రులు సంప్రదించి వారు ప్రతిపాదించిన “ప్రజాస్వామ్యానికి పంచ ప్రాణాలు” అనే శీర్షికన విస్తారంగా వివరాలు తెలుపుతూ ఈమైల్స్ పంపాలని నిర్ణయించుకున్నారు.

————

ఒక్క వారం తిరిగేలొపున అద్భుతమైన స్పందన లభించింది.

ఒక చక్కని సూచన కూడా వచ్చింది – అదే మన దేవాలయాలు, మసీదులు, చర్చ్ లు ఏవిధంగా స్వతంత్ర్యoగా ఉన్నాయో అదే విధంగా ఈ 8 నియోజకవర్గాలలో ఉన్న సమస్త దేవాలయాలు స్వాతంత్ర్యంగా ప్రభుత్వ కంట్రొల్ లెకుండా వాటి నిర్వహణ జరిగేలా చూడటం కూడ ఒక ముఖ్యమైన ఎన్నికల ప్రమాణం గా చేర్చారు. ఇంకా వచ్చిన సలహాలను పరిగణలోనికి తీసుకొని ఈ క్రింది ప్రధాన అవసరాలు తెలిపారు.

“మేము పార్టీలకు అతీతమైన వ్యక్తులం.

స్వతంత్ర అభ్యర్థులం కానీ మా అందరి ఆలోచనా విధానం ఒకటె.

మేము ఒకరికొకరు సహకరించుకొని ప్రతి నియోజక వర్గంలో మేమంతా వంతుల వారీగా ప్రచారం చేస్తాము.

మాకు కావలసింది ప్రధానంగా ఒక వాహనం డ్రైవరు వేతనం, ప్రచారం కోసం చేసే ఖర్చు.

ట్విట్టర్ వంటి సోషల్ మీడియాను అభిలషణీయమైన స్థాయిలో వినియోగించుకోవడానికి కావలసిన ధనం.”

వినూత్న పద్ధతిలో మేము ప్రచారం చేయదలచారు అని విన్నవిస్తూ ఈమైల్స్ పంపారు.

ప్రవాస ఆంధ్రుల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. ప్రతి అభ్యర్ధికి 1 కొటి చొప్పున విరాళాలు సమకూరాయి. అంటే మొత్తం 8 కోట్లు ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ప్రచారానికి

————

ఫ్రచారం నవంబర్ మాసంలోనే మొదలు అయింది.

విజ్ఞులైన ప్రజలు ఆసక్తితో వింటున్నారు, చదువుతున్నారు, స్పందిస్తున్నరు.

వీరి వినూత్న ప్రచారానికి వారిలో ఉన్న నిబద్ధతకు మంచి ఆదరణ దొరికింది.

ఈ 8 మంది స్వతంత్ర అభ్యర్ధులకు ఎవరు సహాయాన్ని అందించారో సవినయంగా తెలుపుతూ వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ ప్రచారం సాగిస్తున్నారు.

బరిలో అప్పటికే ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు వీరిని కొనడానికి అన్ని రకాల వ్యూహాలు వినియోగిస్తున్నారు. ఓట్లు చీల్చవద్దు అని పార్టీల నాయకులు కూడా ఫొన్ చేసి ప్రాధేయ పడుతున్నారు.

ఎట్టి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా ఈ 8 స్వతంత్ర అభ్యర్ధులు వారి ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ముందుగనే వారికి ప్రాణ హాని ఉంది అని లోకల్ పొలీసు స్టేషన్లో విన్నపాలు ఇచ్చి వాటిని మీడియాకు తెలియచేసారు.

————

ప్రచారం ఊపు అందుకుంది.

ఈ 8 స్వతంత్ర అభ్యర్ధులు మరొక ప్రమాణం చేసారు.

ఎం ఎల్ ఎ గా మాకు వచ్చే జీతంలొ కొంత భాగం మీ నుండి వచ్చే విన్నపాలకు వెంటనే స్పందించడానికి ఒక వ్యక్తిని నియమించి ఆ వ్యక్తి ద్వారా మీకు జవాబులు ఇప్పించడం మీ విన్నపాలు సంబంధిత ప్రభుత్వ అధికారులకు చేరేలా చూడడం జరుగుతుంది.

మాకు ఓట్లు వేసి మీరు ఏ మాత్రమూ నష్టపోరు సరిగదా ఎంతో లాభాన్ని పొందగలరు. ఉదాహరణకు: నిడదవొలు రైల్ ఓవెర్ బ్రిడ్జ్ ఎప్పుడో రావాలి. రైల్వే వారు వారి వాటా పని పూర్తి చేసారు. మన రాష్ట్రం చేయవలసిన పని ఇంకా అలానే మిగిలిపోయి ఉంది. ఇటువంటి ఎన్నో పనులు పూర్తి చేయడానికి అవిరళ కృషి చేస్తూ ఎప్పటికప్పుడు మీకు ఆ పనుల తాలూకు ప్రొగ్రెస్ తెలియచేస్తాము.

ఈ ప్రామిస్ కు ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది. ఇదే మేము కోరుకుంటున్నాము. మా ప్రతినిధిగా మా సమస్యలపై మా తరపున పోరాడి మా పనులు పూర్తిచేసే ఎం ఎల్ ఏ మాకు కావాలి అని ఎక్కడ విన్న ఇదే చర్చ జరుగుతోంది.

ఈ 8 స్వతంత్ర అభ్యర్థుల ప్రచారం వారు చేసిన ప్రమాణాలు దేశం మొత్తం తెలిసాయి ఎందరో హర్షం వ్యక్తం చేసారు. ఇన్నాళ్ళకు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో ప్రజల పవర్ ఏమిటో తెలియచేసే అభ్యర్ధులు వచ్చారు అని దేశ ప్రజానీకం వీళ్ళనే గెలిపించండి అని ఆ 8 నియోజకవర్గ ఓటర్లకు విన్నపాలు చేస్తున్నారు.

————

ప్రధాన రాజకీయ పార్టీలలో కలవరం మొదలైంది.

ఇన్నాళ్ళు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనే విధానం ఇక చెల్లదు అనే నిజం వీరికి అవగతమైంది.

వీళ్ళు కూదా ఈ 8 మంది స్వతంత్ర అభ్యర్ధుల వలే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాము అని ప్రమాణం చేసినా ఒక సత్యం మాత్రం బయటపడింది.

ఈ 8 స్వంతంత్ర్య అభ్యర్థులు చేసిన ప్రమాణాలు విన్నక, వాటికి ప్రజలు ఇస్తున్న స్పందన చూసాక అందరూ వీళ్ళ బాటే పట్టడం ఒక మంచి మార్పు.

అంటే ప్రజా ప్రతినిధుల్లో జవాబుదారీతనం ఇప్పటివరకూ లేదు అనే విషయం అందరికీ తెలిసినదే అయినా ఇప్పుడు అది ప్రధాన రాజకీయ పార్టీలకు సమస్యగా మారింది. వారు అవశ్యం మారవలసిన అవసరం ఏర్పడింది.

మార్పు రావడం అంటె ముందు మనం మారడం అనే సత్యాన్ని ఈ 8 మంది స్వంతంత్ర్య అభ్యర్థులు చెసి చూపారు. వీరిని నెగ్గించుకోవదం ఈ 8 నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్ల చారిత్రక అవసరం అనే విషయాన్ని ఎందరొ ధార్మికులు, మేధావులు నొక్కి వక్కాణిస్తున్నారు.

వీరికి కావల్సినంత ప్రచారం వీరి విధానం వలన వచ్చేసింది. ఇది కదా ధర్మో రక్షతి రక్షిత: అంటే.

శుభం

*****

Your views are valuable to us!