ప్రసవ వేదన

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

నేను కలం తో నోబెల్ కొట్టేస్తా 

కలం పట్టుకున్నాక తెలిసింది 
అది కదలడం లేదని 
 
సరే ఒక కొత్త రికార్డు సృష్టిస్తా 
కలం కదిలి ఆగిపోయింది 
 
ఒక ప్రకంపనం పుట్టిస్తా 
ఒక పేజి నిండింది 
సరుకు అయిపొయింది 
 
రోజూ ఏదో ఒకటి వ్రాస్తా 
మొదటి రోజు గడిచింది 
రెండో రోజు కుదరలేదు 
 
సరే ఈ లేఖతో సునామీయే 
లేఖ వెళ్ళింది కాని నిశ్శబ్దం 
 
అసలు ఎందుకు వ్రాయాలి 
ధ్యానం లోకి వెళ్లి పోయా 
 
మళ్ళీ ధ్యానంలో ఆలోచనలు చుట్టుముట్టాయి 
మళ్ళీ వ్రాద్దామని కూర్చున్న రెండు పేజీలు వ్రాసి 
మళ్ళీ ఆగిపోయా !! 
వ్రాయడం చాల కష్టం అని తెలిసిపోయింది 
 
ఇక ఇతరులు వ్రాసింది చదువుతుంటే తెలిసింది 
వాళ్ళు ఎంత కష్టపడ్డారో అని !!
కవిత వ్రాయడం ఒక ప్రసవ వేదనే అని !!
 

Your views are valuable to us!