సాగవోయి సమైక్యాంధ్రుడా! కదలి సాగవోయి పోరుబాటలో……
నేడే శుభోదయం ఆంధ్రుల మనోబలం -నేడే మహోద్యమం నేడే గళోద్యమం
సమైక్యాంధ్ర కోసమని శిబిరాలేసి- నిరాహారదీక్షలోనె
ఓ .. ఉపాధ్యాయుడొరిగిపోయే
ఉద్యమాలకు ఊపిరిపోసి -ఒకేమాట ఒకేబాట సాగాలోయీ
ఆగకోయి సమైక్యాంధ్రుడా !కదలిసాగవోయి
సమరపోరులో ll సా ll
ఆగ్రహాలు మిన్నంటే R.T.Cఒకవైపు -అలుపెరగని సమ్మెతో N.G.O లింకొకవైపు
ప్రతిక్షణం పోరాటం కొనసాగుతూనే ఉంది -తుదివిజయం మనవిజయం ఘనవిజయమెలె
కదంత్రొక్కు సమైక్యాంధ్రుడా !ప్రగతిపధం వైపు ఉద్యమాంధ్రుడా ! ll సా ll
పనులు ,ఉద్యోగాలు మానేసినజనాల -భావావేశాలు రోడ్డెక్కె నేడు
పరిపాలన ఎటు చూసిన స్తంభించెను చూడు -ఆంధ్రమాత కంటివెంట రక్తకన్నీరు
ఆగదోయి సమైక్యుద్యమం -చెలరేగునోయి
ఆద్యంతమూ… ll సా ll
సమైక్యాంధ్ర సాధించుటె మన ధ్యేయం -అమరజీవి ఆశయాలే మన లక్ష్యం
ఏకతాటిపై ఆంధ్రులు నడచిననాడే -అమరజీవికి మన ఆంధ్రదేశం
వినిపించునులే ఐక్యతరాగం -సాగవోయి సమైక్యాంధ్రుడా!!
********