Like-o-Meter
[Total: 0 Average: 0]
సమస్య విమర్శ ఐతే
పరిష్కారం కూడా సమస్యే
అంతరాత్మ ప్రభోదం
అన్నివేళలా అనుససరిస్తే
అందరూ మహాత్ములే
ఒక వృద్ధుడు యుద్ధం చేస్తుంటే
చోద్యం చూస్తున్నాం అంతా
అవినీతి ని అంతమోదించే
ఆరాటం 12 రోజులు గా సజీవంగా
కదలాడుతున్నా, కాదు, ఒద్దు
అని కాలక్షేపం చేసున్నాం
ఏమి చిత్రం జాతి మొత్తం
ప్రేక్షకులుగా మారిపోయి
మాయ మాటల క్రీడలో
మర్మమెరిగీ మున్దుకురాం
అన్నా తో కలసి నిరాహార దీక్ష కు
అదే వేదికపై ఆసీనులం కాం!!
ఎవరి సాకులు వారివి
విరివిగా మాత్రం సానుభూతి
స్వతంత్ర భారతావనిలో
అస్వతంత్రులం మనం!!
అవినీతి నిర్మూలనకు
విధి విధానాలు వెదికే ముందు
ఉందా మనకు చిత్త శుద్ది తో కూడిన వజ్ర సంకల్పం
అన్నా మొండా, జగ మొండా అని కాదు
అన్నా దీక్ష కొనసాగింపు తప్పా ఒప్పా అని కాదు
అన్నా అడుగుచున్న దానిలో అవినీతి ఉందా అని
అడుక్కోవలసిన వాళ్ళు మనమెంచుకున్న నేతలంతా!!
ఇది చేస్తే తప్పు అంటే
చేయాల్సింది: చేయకపోవడమే
ఎలా చేయకుండా ఉందాం
దేనిద్వారా చేయకుండా ఉందాం
అనే ప్రశ్నలు మన చిత్త శుద్దికే శంకలు!!