శ్రీనుని శ్రీదేవి చాలా లవ్ చేస్తోంది!

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 3]

ఈమాట అన్నదెవరు?
శ్రీదేవా?శ్రీనా?
శ్రీను రాస్తే శ్రీదేవికీ్ విషయం తెలుసా?
శ్రీదేవిరాసిందనుకుందాం, శ్రీనుకు తెలుసా?
ఈ ప్రశ్నలకి సమాధానాలెక్కడవెదకాలి!
తమ దగ్గరికి తాము రాసిన ఈ వేదవాక్కు
వస్తుందని వాళ్ళనుకున్నారా?
అబ్బాయి అమ్మాయిని అల్లరి పెట్తున్నాడా?
ఇద్దరూ కలసి పందెం వేసుకున్నారా?
ఎక్కడ ఈ శ్రీను శ్రీదేవిలు?
అడగాలి
పదిరూపాయల నోటుమీద
ఈ ప్రేమవాక్యం ఎక్కడదాకా ప్రయాణించింది!
పూర్వం సీసాలలో ప్రేమ సందేశాలు సముద్రాలు దాటి
ఖండఖండాంతరాలలో ప్రేమని చాటినప్పుడు
చరిత్రలో చదివి ఆనందించినప్పుడు
మనం ఈ ప్రేమికులని
వెదికి పట్టుకుని అడగాలి
సత్యమైన నిత్యమైన ప్రేమకి నమస్కరించాలి!

Your views are valuable to us!