అసలు నీకు తెలంగాణా అంటే తెలుసా?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 
అది ఒక చారిత్రిక అణచివేత కు ప్రతిరూపం
ఒక తేనెలూరు భాషను అపభ్రంశం చేసిన
అమానుష అధికార దాహం
అవిద్యే పెట్టుబడిగా సాగిన అసాంస్కృతిక వ్యాపారం
 
ఒక భాషలో మాండలికాలు ఎక్కడ నుంచి పుడతాయో తెలుసా
మనుషుల్ని చదువుకు దూరం చేయడం తో
చదువు కేవలం కొందరి హక్కు మాత్రమే కావడం తో
ఇది తెలియక చదువుకున్నోళ్ళు సైతం
మాండలికం లో మాట్లాడితే?
ఎంత  మూర్ఖత్వం !!!!
ఎంత అజ్ఞానం !!!!
 
సీకాకులం కాదురా శ్రీకాకుళం అనే ముందునుంచి చెబితే
అది సమ సమాజం
నువ్వు సీకాకులం అనే అను నీ కోసం నే పోరాడతా అంటే
సీకాకులం సీకాకులమే శ్రీకాకుళం శ్రీకాకుళ మే
కాకులు కాకులే కోయిలలు కోయిలలే
కోయిలలు కాకులకు పాడడం నేర్పాలి
ఇది జరగ వలసినది అంతే కాని
ఒక్కొక్క మాండలీకానికి ఒక్కో ప్రత్యెక రాష్ట్రం కాదు
 

Your views are valuable to us!