తెలుగోడు – 2

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

అందరికీ శుభోదయం.
 
నిన్న మొదలుపెట్టిన టపా కి (తెలుగోడు) కొనసాగింపుగా ఈ భాగం సబ్మిట్ చేస్తున్నాను.
 
ఇక అసలు విషయం లోకి వెళితే, మనం బెంగుళూరు లోని మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చిన పరిస్థితులు,వచ్చిన తరువాత  ఉండే ప్రదేశాల గురించి చెప్పుకొని ఆ తరువాత ఒకసారి వారి డైలీ టైం టేబుల్ లుక్కేద్దాము.
 
బెంగుళూరు వచ్చే మన మిత్రులు రెండు రకాలు. మొదటి వర్గం వారు BTech ,MCA లేదా ఇతర కోర్సు లు చదివటప్పుడే , ఎగ్జామ్స్ బాగా రాస్తూ కాలేజీ కి రెగ్యులర్గా వెళుతూ competitive ఎగ్జామ్స్ కి ప్రిపైర్ అవుతూ ఇంటినుండి కాలేజీ కి కాలేజీ నుండి ఇంటికి మాత్రమె తిరుగుతూ బుద్దిగా చదువుకుని ప్రాంగణ ఎంపికలలో(campus recruitement ) నాలుగు అంకెల జీతం తో ఉద్యోగం సంపాదించి వస్తారు.
 
ఇక రెండో వర్గం వారు పైన చెప్పుకున్న కోర్సెస్ చదివేటప్పుడు అసలైన స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేసి అంటే రెగ్యులర్ కాలేజీ కి వెళ్లక పోవడం ,వచ్చిన ప్రతి కొత్త సినిమా చూసి ఎంజాయ్ చెయ్యడం, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కంబైండ్ స్టడీస్ లో previous ఇయర్ మోడల్ పేపర్స్ చదివి  ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతారు.
 
సెకండ్ టైపు వాళ్ళు అంతా ఉద్యోగం కోసం వారి కాంటాక్ట్స్ లోనో లేక సీనియర్స్ నో లేదా వారి చుట్టాలనో ఎప్రోచ్ అవుతారు. వీరు కాంటాక్ట్ ఐన వారు అందరు కచ్చితముగా ఏదో ఒక టెక్నాలజీ మీద ఉద్యోగం చేస్తూ ఉంటారు. అందుచేత వీళ్ళని కూడా అదే టెక్నాలజీ నేర్చుకోమంటారు. వాళ్ళే ఇన్స్టిట్యూట్ అడ్రెస్స్ faculty పేరు చెప్పి పంపిస్తారు. ఇక మన బ్రదర్స్ అందరు మొదటి మజిలీగా USA ని ప్రెఫెర్ చేస్తారు. కంగారు పడకండి USA అంటే మన United states of Ameerpet . సో ఇక్కడ చేరుకున్న తరువాత మన వాళ్ళు స్ట్రిక్ట్ గా ఒక టైం టేబుల్ ప్రిపైర్ చేస్తారు. దాని ప్రకారం స్నేహితులు అందరు కలిసి ఇన్స్టిట్యూట్ కి దగ్గరలో ఉన్న ఏరియా లలో రూం తీసుకుంటారు. సాదారణంగా ఆ ఏరియా లు అయితే Ameerpet , Krishnanagar , Balkampet, Kukatapally,SR Nagar లాంటివి అయ్యి ఉంటాయి.ఎందుకు అంటే ఈ ఏరియా లకు కొన్ని advantages ఉంటాయి. అవి తరువాత మాట్లాడుకుందాము.
 
ఇక మన వాళ్ళ టైం టేబుల్ విషయానికి వస్తే ప్రొద్దునే ఒక క్లాసు అటెండ్ అవ్వటం, తరువాత ల్యాబ్ లో కూర్చొని ఆ రోజు చెప్పిన టాపిక్ ప్రాక్టీసు చెయ్యడం. కాని ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటి అంటే ఫ్రెండ్స్ అందరు కలిసి జాయిన్ అవ్వటం వలన మన వాళ్ళ మాటలతో లేదా క్లాసు కి అటెండ్ ఐన అమ్మాయలని గమనించడంతో క్లాసు ఐపోతుంది కాని టాపిక్ మాత్రం అర్ధం కాదు. ఈ కారణం చేత ల్యాబ్ లో కూడా కేవలం సిస్టం ఆన్ చేసి discuss చెయ్యడం తప్పించి టాపిక్ preperation మాత్రం పూర్తి అవ్వదు. సరే క్లాసు ఐపోయిన తరువాత కుదిరితే దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ రూం కి లేదా వాళ్ల రూం కి వెళతారు. వెళ్ళే ముందు దగ్గరలో ఉన్న కర్రీస్ పాయింట్ లో కర్రీస్ తీసుకొని రూం కి వెళతారు(పైన చెప్పిన ఏరియా లలో ఉన్న ఒక advantage  ఈ కర్రీస్ పాయింట్).
 
ఇక వెళ్ళిన తరువాత రైస్ వండుకొని ,తెచ్చిన కర్రీస్ తో ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న పచ్చళ్ళతో భోజనం ముగించి సర్దే సరికి మధ్యాహ్నం పూర్తి అవుతుంది. తరువాత అలవాటు చేసుకున్నవాళ్ళు కుంభకర్ణుడిని ఆవాహనం చేసుకుంటారు లేని వాళ్ళు సిస్టమ్స్ ముందు  కూర్చుంటారు. అలా సాయంత్రం అవుతుంది. ఇక అప్పుడు అందరు కలిసి బయటకి వెళ్లి టీ కాఫీ  తీసుకుని ఇక ఇంటర్నెట్ సెంటర్స్ కి వెళతారు. రెగ్యులర్ ఉండే మెయిల్స్ చెక్ చేసుకోవడం కుదిరితే ఏవి ఐన జాబు సైట్స్ లో resume  అప్డేట్ చేసి అందరు కలిసి రూం కి వెళుతూ కర్రీస్ తీసుకుని, మిగతా తిప్పలు కానిచ్చి సర్దుకుంటారు. ఇక నిద్ర పోయే ముందు మరోసారి మన కులదేవత  (కంప్యూటర్) ని పలకరించి విశ్రమిస్తారు. ఇది సాదారణంగా మన వాళ్ళ డైలీ టైం టేబుల్. మిగతాది తరువాత భాగం లో మాట్టాడుకుందాము.
 
గమనిక : ఈ వ్యాఖ్యానాల వాళ్ల ఎవరిని నొప్పించాలని నా భావం కాదు, కేవలం నేను చూసిన నన్ను కలిసిన స్నేహితుల అనుభవాలను అందరితో పంచుకోవాలని నా ఈ చిన్న ప్రయత్నం.

Your views are valuable to us!