తెలుగోడు – 3

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

అందరికీ తిరిగి వచ్చినందుకు నమస్కారం.

నిన్నటి భాగం తరువాత మళ్లీ మన ప్రపంచంలోకి ప్రయాణిద్దాము.

అసలు కధలోకి వస్తే, ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పుకున్న టైం టేబుల్లో  సాదారణంగా మార్పు ఉండదు. అయితే వీక్ఎండ్లో  మాత్రం మార్పు ఉంటుంది. అది ఏంటి అంటే సాధారణంగా కొత్త సినిమాలు అన్ని ఫ్రైడే రిలీజ్ అవుతాయి. కాబట్టి మన మిత్రులు అందరూ ఆరోజు ఏమైనా ఒక చిత్రం రిలీజ్ అవుతుంటే హైదరాబాద్లో ఉన్న 90 థియేటర్స్ లో ఎక్కడో ఒక దానిలో టికెట్ సంపాదించి ఆ మూవీ కి వెళతారు ( నాకు తెలిసిన మిత్రులు ఉండేది మియాపూర్ లో, కాని వారికి ఒకోసారి ఆ చుట్టుపక్కల ఉన్న సినిమా హల్ల్స్ లో టికెట్స్ దొరక్క, వారు అంబర్ పేట్ లేదా దిల్షుఖ్ నగర్ వెళ్లి సినిమా చూసి వచ్చేవారు).

ఇక ఫ్రైడే ఎప్పుడైతే క్లాసు మిస్ అయ్యి సినిమా హల్లో అటెండెన్స్ పడిందో మనం ఈజీగా చెప్పేయొచ్చు శనివారం క్లాసు బంక్ అని.  దీన్ని బట్టి తేలింది ఏమిటి అంటే మన క్లాసుల్లో వారానికి 6 క్లాసులు ఉంటే 2 క్లాసులు ఈవిధంగా పోయినట్టే. అంటే ఉన్న ఎనిమిది వారాల్లో రెండు వారాల క్లాసులు మిస్ అవుతున్నారు అన్న మాటే. మిగిలిన క్లాసులు ఏమో మనం ముందు చెప్పుకున్నట్టు  లాబ్ లో అవుట్ పుట్ రాక మిస్ అవుతారు. ఇక ఏది ఐతే ఏమి ఈ మిస్ ఐన క్లాసులు అటెండ్ అవ్వడానికి మళ్లీ పర్మిషన్ తీసుకుని కోర్సు కంప్లీట్ చేసే సరికి రెండు నెలల కోర్సు కాస్తా మూడు నెలలు అవుతుంది. ఇక కోర్సు ఐన తరువాత మళ్లీ ఒక సారి పెద్దలని( seniors , relatives )  దర్శనం చేసుకుంటారు. వాళ్ళు ఇంతక ముందు ఏమి కోర్సు నేర్చుకొమ్మన్నారో మర్చిపోతే మళ్లీ మన వాళ్ళు ఒకసారి  గుర్తు చేస్తారు. ఇక అప్పుడు ఈ పెద్దలు ఒక పూట అంతా వాళ్ళ  మేనేజర్ వాళ్ళ మీద ప్రయోగించిన నానా రకాల టెక్నికల్ టెర్మ్స్, ఫ్లో చార్ట్స్ ,  ఇమ్పాక్ట్ అనాలసిస్ లు మన వల్ల మీద ప్రయోగిస్తారు. ఈ దెబ్బతో మనవాళ్ళు అందరు పండు గాడి దెబ్బతిన్న సుబ్బరాజుల్లాగా మారిపోతారు.

సరే చివరికి పెద్దలు వారిని రెస్యుమ్ తయారు చేసి పంపమంటారు. నాకు అర్ధం కానిది ఏంటి అంటే మన వాళ్ళు పెద్దల దగ్గరికి వెళ్ళిందే వాళ్ళు రెస్యుం ప్రిపరేషన్ లో హెల్ప్ చేస్తారు, ఇంకా ఏమి అన్న రెఫెరెన్సు ఇస్తారు అని. కాని ఈ పెద్దలు ఉన్నారే వీళ్ళు అంతా కేవలం మన వాళ్ల దగ్గర వాళ్ళు ఏదో కంపెనీ రన్ చేస్తునట్టు బిల్డ్అప్ ఇచ్చి ఈ పనులు నుండి తప్పించుకుంటారు. సరే వీళ్ళ దగ్గర సెలవ తీసుకున్న మన వాళ్ళు ఇక వేరే ఆప్షన్ లేక వాళ్లలో వాళ్ళు డిస్కస్ చేసుకుని ఏది అయితేనేమి రెస్యుమ్  తయారు చేసి సోకాల్డ్ పెద్దలకి మెయిల్ చేస్తారు. వాళ్ళు ఒక వారం పాటు రిప్లై ఇవ్వరు కాల్ చేసినా ఆన్సర్ చెయ్యరు. మన వాళ్ల అదృష్టం కొద్ది ఏదో ఒన్ ఫైన్ వీక్ ఎండ్ వాళ్ళు ఫోన్ చేసి నీ రెస్యుమ్ చూసాను కాని అది కరెక్ట్ గా  లేదు అని ఒక పది మోడిఫికేషన్స్ చెప్తారు. వాళ్ళే మోడిఫయ్ చేసి పంపితే ఎంత బాగుంటుందో ఒకసారి కూడా ఆలోచించారు. ఏది ఐతే నేమి మన వాళ్ళకి ఇక విషయం అర్ధం అవుతుంది.

ఈ పెద్దలు ఎలాగు మనకు హెల్ప్ చెయ్యరు అని అర్ధం చేసుకుని ఎలాగోలాగ తమ తిప్పలు తామే పడదామని డిసైడ్ చేసుకుంటారు. అందరు కలిసి ఎలా జాబ్స్ ట్రై చేద్దామా  అని డిస్కషన్స్ చేస్తారు. ఈలోగా ఎవరైనా జాలి గల బ్రమ్హి(సాఫ్ట్వార్ ఇంజనీర్)లు కనిపించి లానా కంపెనీ లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అని చెప్తాడు. సో! మన వాళ్ళు దాని మీద ఒక లుక్కు వేద్దామని అందరు కలిసి దండయాత్ర చేస్తారు.
అయితే ఆ కంపెనీ వాడు కేవలం అనుభవం వున్న వాళ్లకి మాత్రమె ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నామని చెప్తాడు. దానితో మన వాళ్లకి తిక్కరేగి ప్రతి ఒక్కడు ఫ్రెషర్స్ ని తీసుకోకపొతే ఎలా అని వాళ్ళ లో వాళ్ళు చర్చలు జరుపుకుంటారు. దీనితో వాళ్ళు కూడా ఒక అల్టిమేట్ డెసిషన్   తీసుకుంటారు అది ఏంటి అయ్యా అంటే ఎలాగు మనకు ఫ్రెషర్స్ గా జాబ్స్ రావట్లేదు కాబట్టి మనం కూడా ఎక్స్పీర్యన్స్ తో జాబు ట్రై చేద్దాము అని. ఈలోగా మన వాళ్ళలోని ఒక షార్ప్ కాండిడేట్ వారి ఎరికలో ఉన్న ఒకనొక కాండిడేట్ కూడా అలాగే జాబు కొట్టి ఇప్పుడు మంచి పోజిషన్ లో ఉన్నాడని ఉప్పందిస్తాడు. దానితో మన వాళ్ళు డిసైడ్ ఐపోతారు.

ఇక తరువాత ఏ ప్లేస్ కి వెళ్ళాలా అని ఆలోచిస్తే సగం మంది బెంగుళూరుకి ఒటేస్తారు. దానితో మన హైదరాబాద్ బావలు/బాయిలు  కాస్త బెంగుళూరు మగనెలు గా మారిపోదామని డిసైడ్ ఐపోతారు(ఆంధ్ర లో అయితే మనకి ఫ్రెండ్స్ ని బావా లేదా బాబాయి అని పిలిసే అలవాటు. అదే బెంగుళూరు లో అయితే మగనె (ఒరే అబ్బాయ్) అని పిలుచుకుంటారు).

ఇంకా ఎందుకు ఆలస్యం అని ఇంట్లో వాళ్ళ అందరికీ మెసేజ్ కొట్టేసి బెంగుళూరు లో ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్స్ తో ఇన్ఫార్మ్ చేసి ఒకసారి అందరు కలిసి చివరిసారిగా వీసాల వెంకన్న నో లేదా బిర్లా గోవిందుడినో దర్శించుకుంటారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న కేశినేనికో లేదా APSRTC కౌంటర్ కో వెళ్లి మంచి రోజు కి బెంగుళూరు వీసా తీసుకుంటారు. దీంతో మన వాళ్ళ జర్నీ హైదరాబాద్ లో పూర్తి అయ్యి బెంగుళూరు కి ట్రాన్స్ఫర్ అవుతుంది. 

ఇప్పుడే సెకండ్ స్టేజి స్టార్ట్ అవుతుంది. సాధారణంగా మారతహళ్లి లో ఉండే అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్  ఆఫీసులు ITPL, Outer ring road, Silk board లేదా Electronic City ఏరియాల లో ఉంటాయి. హైదరాబాద్ నుండి వచ్చిన మన మిత్రులు కూడా 90 శాతం ఈ ఏరియాకి లేదా BTM ,కోరమంగల లేదా మత్తికేరే లో ఉంటాడు. వచ్చిన తరువాత మనవాళ్ళు మొదట ఏదైనా PG లలో జాయిన్ అవుతారు.అద్దె ఎక్కువ ఐన వాటర్ ప్రాబ్లం ఉన్నా pollution ఎక్కవగా ఉన్నా సరే ఈ ఏరియా లో ఎందుకు ఉంటారు అని ప్రశ్నిస్తే వచ్చే జవాబు ఫుడ్ ప్రాబ్లం ఉండదు అని.అది 100 % నిజం.

ఈ ఏరియా  లో ఉన్న హోటల్స్ లో నూటికి తొంబై శాతం తెలుగు వాళ్ళవి. అందులో కూడా ఒక నలబై శాతం హోటల్స్ ని రన్ చేసేది, ఒకానొక సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఆంధ్ర నుండి వచ్చి  ఉద్యోగం దొరక్క లేదా వచ్చిన ఉద్యోగం నిలబెట్టుకోలేక ఏమి చెయ్యాలో తెలీక ఎక్కడ తినాలో అర్ధం కాక ఏమి అయితే అయ్యిందిలే అని ధైర్యం చేసి ఫ్రెండ్స్ దగ్గరో లేదా చుట్టాల దగ్గరో అప్పు చేసి హోటల్ పెట్టిన వాళ్ళు. దీని వల్ల మనకు అర్ధం అయ్యింది ఏమిటి అంటే అలా ఆనాడు వాళ్ళు చేసిన ధైర్యం మన పాలిట అదృష్టం అయ్యింది. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఏరియా లో ఉన్నా జనాబాలో ఎనబై శాతం జనాబా తెలుగు వాళ్ళే. వీరు అందరు ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం ఆ హోటల్స్. 

ఇప్పటి కూడా ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాల మీద కొత్తగా ఈ ఏరియా కి వచ్చిన వాళ్ళు వాళ్ల ఫ్రెండ్స్ తో అనే మాటల్లో ఉండే మొదటి విషయం ఏమిటి అయ్యా అంటే ” అరె మామా ఈ హోటల్ వాడు పలానా ఇయర్ లో సాఫ్ట్వేర్ జాబు రాక ఈ హోటల్ పెట్టాడు రా ఇప్పుడు వీడి సంపాదనతో ఇక్కడే వీడు ఒక ఇల్లు కొన్నాడు. వీడి నెల జీతం మా బావ వాళ్ళ PM జీతం కన్నా ఎక్కువ అంట. అందుకే నాకు కనుక కొన్నాళ్ళ లో జాబు రాక పోతే నేను కూడా మంచి హోటల్ ఓపెన్ చేస్తాను, అందుకు వంట మాస్టర్ ని ఆల్రెడీ మా వూళ్ళో మాట్లాడి ఉంచాను. ఇంక తరువాత కర్రీస్ పాయింట్ కూడా పెడతాను, ఎలాగు అది కూడా వర్కౌట్ అవుతుంది లే“. ఈ విషయం నేను బెంగుళూరు వచ్చిన ఈ ఐదు ఏళ్లలో కనీసం ఒక 100 మంది దగ్గర ఐన విని వుంటాను.

ముందు మనం చెప్పుకున్నట్లు ఆంధ్ర మెస్సులు , హోటల్స్ తరువాత మనం చెప్పుకోవలసింది PG ల గురించి. మారతహళ్లిలో PG లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయ్. అందుకే మన వాళ్ళు ఇక్కడ ఉన్న PG ల లో ఒక రూం అందరు కలిసి తీసుకుని దగ్గరలో ఉన్న మెస్సుల్లో భోజనం కానిస్తూ మన ఆంధ్ర వాతావరణం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన మన వాళ్ళ దినచర్య ఎలా వుంటుంది అంటే హైదరాబాద్ లో ఉన్న టైం టేబుల్ కి దీనికి ఆట్టే తేడా ఉండదు. కాకపొతే వచ్చిన తేడా అల్లా ఏంటి అంటే క్లాసు కి వెల్ల వలసిన అవసరం ఉండదు కాబట్టి మన వాళ్ళ టైం అమెరికా టైం తో పాటు నడుస్తూ ఉంటుంది. సపోస్ ,పర్ సపోస్ ఓ రోజు కాల్షీట్ చూస్తె పొద్దునే 11 -12 కి మద్యలో నిద్ర లేస్తారు. ఎలాగు లేట్ గా లేచారు కాబట్టి బ్రేక్ ఫాస్ట్ కట్. సో డైరెక్ట్ గా లంచ్ ఎటాక్.

దీనికోసం దగ్గరలో ఉన్న ఒక మంచి ఆంద్ర మెస్ చూసుకొని వెళ్లి భోజనం కానిస్తారు. తరువాత ఎలాగు సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి వాటి ముందు కూర్చొని ఒక మూవీ దేఖేస్తారు. దీంతో టైం కాస్త టీ నీళ్ళ టైం కి చేరుతుంది. ఇక అందరూ కలిసి వెళ్లి కాస్త వేడి వేడి గా మన బజ్జీలు , పునుగులు సేవించి ఒక టీ తీసుకుని కొద్ది సమయం శ్రమదానం చేద్దామని వీధుల్లో ఉన్న దుమ్ము ధూళిని మన వాళ్ళ బాడీల్లోకి ఎక్కిస్తారు. దీంతో డిన్నర్ టైం అవుతుంది. మళ్లీ ఏదో ఒక మెస్ లో చపాతీ నో కర్డ్ రైసో లాగించి ఇక రూం కి వెళతారు. తరువాత ఏకబిగిన ఒక రెండు అలనాటి చిత్రరాజాలని చూసి పడక వేసే సరికి పాల వ్యాన్లు వచ్చే టైం అవుద్ది. ఇక లెగిసిన తరువాత మళ్లీ సేమ్ స్టొరీ రిపిట్ ఓన్లీ హోటల్ అండ్ ఐటమ్స్ చే౦జ్.

అయితే వీరు అందరు కూడా ఇక్కడికి వచ్చిన కొత్తలో చాలా ఇంట్రెస్ట్ తో ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న ఫ్రెండ్స్ ని కలుసుకొని ఇంటర్వ్యూ టిప్స్ అడిగి తెలుసుకుంటారు. తరువాత దగ్గరలో ఉన్న నెట్ సెంటర్స్ లో మెంబర్ షిప్ కార్డు తీసుకొని రెగ్యులర్ గా నెట్ కి వెళ్లి రెస్యుమే అప్డేట్ చేసి ఏవైనా జాబ్ సైట్స్ లో జాబ్స్ ఉంటే వాటికి అప్లై చేస్తారు. వీకెండ్స్ లో ఏమైనా ఇంటర్వ్యూసు లేదా వాక్ ఇన్స్ ఉంటే వాటికి అటెండ్ అవుతారు. వచ్చిన తరువాత అందరూ కూర్చొని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అవుతారు. ఈ విధంగా మన వాళ్ళు నానా కష్టాలు పడుతూ ఉంటే ఈలోగా ఇంటి దగ్గర నుండో లేక చుట్టాల దగ్గర నుండో ఫోన్ వస్తుంది. వాళ్ళు “ఏంట్రా ఇంకా జాబ్ రాలేదా అంటూ”? అక్కడికి ఇక్కడ ఏదో జాబ్స్ రెడీ గా ఉన్నట్టు. రాలేదు అంటే చాలు ఇక వాళ్ళు ఒక దండకం మొదలు పెట్టి చివర్లో దక్షిణ వేసినట్టు పలానా వాడు నాకు తెలుసు వాడిని కలువు నీకు జాబ్ కన్ఫర్మ్ అని చెపుతారు. దీనితో మనవాడికి అనిపిస్తుంది ” ఇంటి పేరు కస్తూరి వారు , ఇంట్లో గబ్బిలాల కంపు అని” ఎందుకు అంటే ఇదే పెద్దమనుషులు వాళ్ళ అబ్బాయిలకో లేదా తెలిసిన వాళ్ళకో జాబ్ ఇప్పించమని మన అన్నలనో బావలనో ఆల్రెడీ అడిగి ఉంటారు. కాని మన దగ్గరకి వచ్చేసరికి వాళ్ళే మనకి జాబ్ ఇప్పించేటట్టు ఫీల్ అవుతూ ఉంటారు.

సరే ఇది రోజు ఉండే గోలే కదా అని మన వాళ్ళు మాత్రం వాళ్ళ బండి లాగించేస్తూ ఉంటారు. ఈలోగా ఒనె ఫైన్ ఫ్రైడే మన తెలుగు హీరో సినిమా ఒకటి రిలీజ్ కి రెడీగా ఉంటుంది. దాంతో దాని టికెట్ కోసం రెండు గంటల ముందు నుండి లైన్ లో ఉంటారు. ఎందుకు అంటే ఈ ఏరియాలో సినిమా టికెట్ దొరకడం ఈజీ నే కానీ తరువాత థియేటర్ లో సీట్ దొరకడం చాలా కష్టం. ఎందుకు అంటే సినిమా హాల్ వాడి దృష్టిలో వాడి హాల్ పుష్పక విమానం లాంటిది. ఎన్ని టికెట్స్ ఇచ్చిన ఇంకో వంద మందికి సీట్స్ మిగిలే ఉంటాయి. అందుకోసమే మన వాళ్ళు రెండు గంటలు యుద్దాలు చేసి టికెట్ సంపాదించి ముందు పరిగెత్తి ఫ్యాన్ కింద ఉన్న సీట్ వెతుక్కొని సర్దుకొని కూర్చునే సరికి సినిమా స్టార్ట్ అవుతుంది. తీరా చూస్తే అది కచ్చితం గా మహా ఫ్లాప్ సినిమా అవుతుంది. కానీ కలెక్షన్స్ ఫుల్ సినిమా వాడికి, మన వాళ్లకు ఫ్యుజె నిల్లు. బయటకి వచ్చాక మన వాడు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటాడు. ఏంటి అంటే జాబ్ వచ్చే అంత వరకు మళ్లీ సినిమా చూడను అని. ఈ నిర్ణయం తరువాత ఫ్రైడే వరకు అసిధార వ్రతం పాటించి నట్టు పాటిస్తాడు. కానీ ఫ్రైడే మళ్లీ మామూలే. మరో కొత్త  సినిమా మరో కొత్త ఫ్రైడే.

దీని వల్ల లాబం ఎవడికిరా అంటే ఖచ్చితంగా ధియేటర్ వాడికే అని నొక్కి వక్కాణించి చెప్పగలం. ఎందుకు అంటే ధియేటర్ వాడు కూడా తెలివిగా పెద్ద హీరోలవి లేదా హీరోఇన్స్ వి అన్ని అడ్డమైన తెలుగు సినిమాలు తీసుకు వస్తాడు. కానీ మంచి సినిమాని మాత్రం తీసుకు రాడు. పోనీ సినిమా టికెట్ ఐనా కరెక్ట్ గా ఇస్తాడ అంటే అదీ లేదు ఒక్కసారి గా వీకెండ్ అయ్యేసరికి 100 రూపాయలు అవుద్ది టికెట్. ఇది ఏంటి అని ఎవడన్నాఅడిగితే వాడు చెప్పే సమాధానం “కన్నడలో మాట్లాడు నేను సమాధానం చెపుతాను”  అని. ఇంకా ఏముంది మన వాడు సినిమా చూడకుండా ఉండలేదు కాబట్టి వాడు చెప్పిన రేట్ కి టికెట్ కొని ఆ చిత్రాన్ని వీక్షించి జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకొని ఇంటికి వెళతాడు. మళ్లీ షరా మాములే.

ఇక తరువాత భాగం లో మిగిలిన అన్ని ముచ్చట్లు చర్చించి ఈ శీర్షికని ముగిద్దాము. మరి మళ్లీ మీ అందరిని తరువాత భాగంలో కలుస్తాను.

Your views are valuable to us!