తెలుగోడు-4 చివరి ఘట్టము

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

అందరికీ నమస్కారం.

మునుపటి భాగంలో(తెలుగోడు – 3) ప్రస్తావించినట్టు సినిమా వల్ల లాభం కేవలం ధియేటర్ వాడికే అని ఒక ఉదాహరణ తో వివరిస్తాను.

మనం అందరమూ చిన్నప్పుడు  వేసవి కాలం సెలవల్లో అమ్మమ్మ, తాతయ్య, మేనత్త లేదా మేనమామ ల ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళమే. నేను కూడా మా మేనత్తగారి ఇంటికి వెళ్లి ఉన్నాను. నేను ఒకసారి 7 తరగతి సెలవల్లో మా మేనత్త గారి ఇంటికి వెళ్ళాను. అది గుంటూరు దగ్గరలో ఒక పల్లెటూరు. ఆ వూరికి డైరెక్ట్ గా బస్సు కూడా లేదు. అయితే మేము వస్తున్నట్టు ముందుగానే తెలియచేయటం వల్ల  మామయ్య వాళ్ళ పిల్లలు దగ్గరలో ఉన్న బస్సు స్టాండ్ కి బండి కట్టుకొని వచ్చారు. అక్కడి నుండి వూరు ఇంకా 3 కిలోమీటర్లు. సామాను ని బండి మీద పెట్టి మేము నెమ్మదిగా  కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేస్తూ దారిలో కనిపించిన వాళ్ళని పలకరించుకుంటూ ఇంటి కి వెళ్ళే సరికి ఒక గంట పట్టింది. ఇక వెళ్ళిన తరువాత భోజనం చేసి అందరితో మాట్లాడుతూ ఉండే సరికి మధ్యాన్నం కాస్తా సాయంత్రం అయ్యింది. ఆ తరువాత స్నానాలు కానించి, పాలు టీలు తాగేసరికి మా మావయ్య వాళ్ళ పిల్లల స్నేహితులు వచ్చారు. అయితే ఆ వచ్చిన వాళ్ళు, మా మావయ్య వాళ్ళ పిల్లలు మా ఈడు వాళ్ళే. దాంతో వాళ్ళు దగ్గరలో ఉన్న సినిమా కి వెళదామని ప్రతిపాధించారు. కాని నాకు మళ్ళీ అంత దూరం నడిచే ఓపిక లేక నేను ,మా చిన్న అన్న గాడు మేము రాలేము అని చెప్పాము. అయితే వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోక అందరము కలిసి సైకిళ్ళ మీద సినిమా కి వెళదాము అని చెప్పారు. దాంతో మేము కూడా ఒప్పుకున్నాము. అయితే మా అత్తయ్య వాళ్ళు మాత్రం మాకు ఆ చల్ల గాలి పడదు అని చెప్పి మమ్మల్ని వెళ్ళద్దు అని చెప్పారు. కాని మేము కొంచెం సేపు వాళ్ళని బ్రతిమాలి ఎలాగైతే నేమి అందరం కలిసి ఒక నాలుగు సైకిళ్ళ మీద సినిమాకి బయలుదేరాము.


మేము వెళ్ళే సరికి సినిమా మొదలు పెట్టె సమయం కావస్తుంది. ధియేటర్ వాడు ఎవర్ గ్రీన్ “నమో వేంకటేశా …..” రికార్డింగ్ పెట్టి ఉన్నాడు. అప్పుడు ధియేటర్ లో ANR గారి దసరా బుల్లోడు సినిమా ఆడుతుంది. మేము అప్పటికే ఆ సినిమా ని VCR లో, ఇంకా కేబుల్ వాడి లోకల్ ఛానల్ లో చాలా సార్లు చూసి ఉన్నాము. ఐన మాతో వచ్చిన ఇతర మిత్రులును నిరుత్సాహ పరచాడానికి ఇష్టం లేక కాళ్ళీడ్చుకుంటూ లోపలి కి వెల్ల డానికి తయారు అయ్యాము. ఈలోగా మా మిత్రులలో ఒకడు వెళ్లి అందరికీ టికెట్స్ తీసుకొని వచ్చాడు. ఆ ధియేటర్ లో వాళ్ళ మామయ్య వాళ్లకి కొంచం వాటా ఉండటం వలన మా వాడు హాఫ్ రేట్ కే టికెట్స్ పట్టుకు వచ్చాడు. తరువాత లోపలి వెళ్ళే ముందు దగ్గరలో ఉన్న మామ్మ దగ్గర వేడి వేడి మొక్కజొన్న పొత్తులు తీసుకొని లోపల గుమ్మం దగ్గరలో ఉన్న బల్లల మీద సెటిల్ అయ్యాము. గుమ్మం దగ్గరే కూర్చోవటం వల్ల ఫ్యాన్ లేక పోయనా సరే చల్లటి గాలి ముఖానికి తగిలి గిలిగింతలు పెడుతుంది. ఈ లోగా జనం లోపలకి వచ్చి సర్దుకు కూర్చోనే   సరికి ధియేటర్ వాడు తెర మీద కుటుంబ నియంత్రణ మీద న్యూస్ రీల్ ,అది అవ్వగానే చిన్న కుటుంబం చింతల్లేని కుటుంబం అని ఇంకో న్యూస్ రీల్ వేసి , వెంకన్న దేవుడి బొమ్మ ఒకసారి తెర మీద చూపించి asalu  బొమ్మ వేసేసాడు. ఇక అప్పటి నుండి ఇంటర్వల్ వచ్చేవరకు టైం ఎలా గడిచిందో అస్సలు గుర్తు లేదు. అంతగా బొమ్మలో లీనం అయిపోయాము. ఇక ఇంటర్వల్ లో లోపలికి వేడి వేడి గా శనక్కాయలు, పులి బొంగరాలు , మసాల వడలు వాటి తో పాటే గోలి సోడా, రంగు సోడా వచ్చాయి. అన్నిటిని సమ దృష్టితో చూడాలన్న మా తెలుగు మాస్టారు పాఠం గుర్తుకు వచ్చి అన్ని ఐటెంస్  ని కొని రుచి  చూసాము. ఆ తరువాత మిగతా భాగం కూడా ఏంటో వేగంగా సాగి సినిమా పూర్తి అయ్యింది. అయితే మొదటి సారి నాకు సినిమా ఇంకా కొంచం సేపు ఉంటె బాగుండును కదా అనిపించింది. అంతగా నచ్చింది నాకు ఆ వాతావరణ౦.                                     

ఈ లోగా బయటకు వచ్చే సరికి మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య ఇందాక ధియేటర్ లో చిరుతిళ్ళు అమ్మిన వాళ్ళతో ఏదో మాట్లాడుతూ కనిపించాడు. సరే అని మేము కూడా వెళ్లి ఆయనను పలకరించే సరికి ఆయన ఆ చిరుతిళ్ళ వాళ్లకి సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ కనిపించారు. విషయం ఏమిటా అని అడిగితే ఆయన చెప్పిన సమాదానం కొంచెం సేపు నివ్వెర పరిచింది. ఇంతకీ ఆయన చెప్పిన సమాధానం ఏంటి అంటే ఆ ఉళ్ళో వాళ్ళే కాక చాలామంది చిరుతిళ్ళు అమ్మే వాళ్ళు ఉన్నారు అంట. అందుకే ఒక్కో ఆటకి కొంత మందిని పంపించి, తరువాత ఆటకి మిగిలి ఉన్న వాళ్ళని లోపలి పంపిస్తారు అంట. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళు వేరే వాళ్ళని పంపించకు౦డా మళ్లీ వాళ్ళనే పంపించమని అడుగుతుంటే  ఆయన వాళ్ళకి చివాట్లు పెడుతున్నాడు. ఇలా చేస్తే మిగిలిన వాళ్లకి తిండి ఎలాగా అని వాళ్ళని తిడుతున్నారు.  అయితే అప్పట్లో మనం ఇంకా బుడ్డ పిలకాయలమే కాబట్టి దాని అర్ధం తెలియలేదు. కాని గత సంవత్సరం వచ్చిన “అందరి బంధువయా” సినిమా చూసాక అందులో నరేష్ హీరోయిన్ తో చెప్పే డైలాగ్ విన్న తరువాత నా చిన్న నాటి ఈ సంఘటన  తో రిలేట్ చేసి చూస్తే క్లియర్  గా అర్ధం అయ్యింది. సినిమా లో నరేష్ చెప్పే డైలాగ్ ఏంటి అంటే ” పక్షికి ఇంత ధాన్యం, పశువు కి ఇంత గ్రాసం, మనిషి కి ఇంత సాయం- ఇంతే కదా జీవితం”. నిజంగా ఎంత గొప్ప సూక్తి. ఇది విన్న తరువాత నిజంగా నాకు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య చెప్పింది చాలా అమాజింగ్ గా అనిపించింది. మీరు అందరూ అడగొచ్చు దీనికి, మనం చెప్పుకున్నట్టు ధియేటర్ వాడికి ఏమిటి సంబంధం  ఏంటి అని?  అక్కడికే వస్తున్నాను. 

                              

ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ధియేటర్స్ కి వెళ్ళాము అనుకోండి వాడు తెలుగు సినిమా కి ఒక రేట్, లోకల్ సినిమా కి ఒక రేట్ వసూలు చేస్తాడు. ఉదాహరణకి తెలుగు సినిమా టికెట్ రేట్ 100 రూపాయలు అయితే లోకల్ సినిమా టికెట్ రేట్ ఖచ్చితంగా 50 రూపాయలే ఉంటుంది. ఒక  20 శాతం టికెట్స్ కౌంటర్ లో ధియేటర్ వాడు అమ్మి, మిగిలినవి వాడే దగ్గర ఉంది బ్లాకు లో అమ్మిస్తాడు. ఈ లోగా ఎవరైనా బీట్ పోలీసు వస్తే వాళ్లకి ఒక 100 ఇచ్చి పంపిస్తాడు. పోనీ మనం ఏమన్నా కంప్లైంట్ చేద్దామన్న పోలీసు వాళ్ళు చాలా జాలిగా ముందు కన్నడలో మాట్లాడు అని చెప్తారు( ఇది మారతాల్లి లో ప్రతి ఫ్రైడే జరిగే సీన్).అంతే కాదు పోనీ సీట్స్ అన్నా సరిగ్గా ఉంటాయా అంటే చెప్పలేము. దానికి తోడు పార్కింగ్ ఛార్జ్ మినిమం 10 రూపాయలు. ఇక లోపలి వెళ్ళాక ఫ్యాన్స్ ఉండవు. సీట్స్ కూడా కొన్ని అయితే కూల్ డ్రింక్ బాటిల్స్ కేసు ల మీద కూర్చో పెడతాడు. అదేంటి అంటే ఇష్టం ఉంటె కూర్చో లేదా వెళ్ళిపో అంటాడు అంతే కాని డబ్బులు తిరిగి ఇవ్వడు. ఇక స్నాక్స్ కూడా వాడి కాంటీన్ లో మాత్రమే కొనాలి, అవుట్ సైడ్  ఫుడ్ ఎలో చెయ్యడు. కేవలం వాడు మాత్రమె బతికి మిగతా వాళ్ళ కడుపు కొడతాడు. ఈ విధంగా జరిగేది కేవలం మామూలు ధియేటర్ లో నే కాదు. ఇప్పుడు వచ్చే సో కాల్లెద్ మల్టీప్లెక్స్ లో కూడా ఇంతకు మించి దోపిడీ జరుగుద్ది.                                          

నేను బెంగుళూరు వచ్చిన కొత్తలో మల్టీప్లెక్స్ లు కేవలం ఒక మూడు ఉండేవి. వాటిలో టికెట్ మహా అయితే 80  రూపాయలు.  అప్పట్లో స్నాక్స్ ప్రైస్ కూడా పాప్కార్న్అయితే 20 రూపాయలు, కూల్ డ్రింక్ 10 రూపాయలు. కానీ ఇప్పుడు జంక్షన్ కి ఒక మల్టీప్లెక్స్. టికెట్ ప్రైస్ కూడా మినిమం 150 రూపాయలు, అంతే కాకుండా వీక్ డే ప్రైస్ తక్కువ పెట్టి జనాలని ఇంకా సోమరులగా  మారుస్తున్నారు. దీనికి తోడూ స్నాక్స్ ప్రైస్ అయితే టికెట్ ప్రైస్ కి ఆల్మోస్ట్ ఈక్వల్ ఐపోయింది. పోనీ ఫాసిలిటీస్ ఏమన్నా పెంచాడా అంటే ఇంకా తగ్గిచ్చారు. అప్పట్లో పార్కింగ్ కి సరి పోయేంత ప్లేస్ ఉండేది ఇప్పుడు ఎవడు ముందు వస్తే వాడికి పార్కింగ్ దొరుకుద్ది, అది కూడా ఏమి కవర్డ్ పార్కింగ్ కాదు, ఎవరి బండికి వారే భాధ్యులు. అందుకే చెప్పేది ఇప్పడు సినిమా వాళ్ళ మన ఎంజాయ్ మెంట్ మాట దేవుడు ఎరుగు, ధియేటర్ వాడు మాత్ర౦  మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు.  అయితే మన మిత్రులు మాత్రం వీటిని ఏ మాత్రం పట్టించుకోక ఎప్పుడు కొత్త సినిమా వస్తే అప్పుడు  ఎంత చెప్తే అంత రేట్ కి టికెట్ కొని  వెళ్లి చూసేస్తారు. అంతే కానీ ఒక్క సారి కూడా ఆలోచించరు. అంతే కానీ మనం ఇప్పుడు చెప్పబోయే సినిమా వంటి మంచి సినిమా ని ఫ్రీ గా చూపిస్తామన్నా సరే సగం మంది సినిమా చూడరు. మారతహళ్లి లో ఒక నొక ధియేటర్ లో మన వాళ్ళు అతి ఉత్తమ మైన మైసమ్మ IPS , మంగతాయారు టిఫిన్ సెంటర్ వంటి సినిమా లకి కూడా 100 రూపాయలకి టికెట్ కొని వెళ్ళిన వాళ్ళు నాకు తెలుసు. ఇలాంటి వాళ్ళు అందరు ఒక విషయాన్ని ఎందుకు ఆలోచించరు. వీళ్ళు అందరు కూడా ఒక రెండు వారాలు కొత్త సినిమా వచ్చిన కూడా చూడక పోతే ఆ ధియేటర్ వాడు తప్పకుండా టికెట్ ప్రైస్ నెక్స్ట్ టైం నుండి తగ్గిస్తాడు.                                        

ఇక మన విషయానికి వస్తే నేను ఈ ఆర్టికల్ మొదట్లో చెప్పింది నేను ఈ టపా రాయటానికి కారణం నేను చూసిన ఒక మంచి సినిమా. ఆ సినిమా నాకు తెలిసి మనలో చాలా మంది చూసి ఉండరు. ఎందుకు అంటే  మొదట ఆ సినిమా ఒక చిన్న సినిమా, అందువలన ఈ ధియేటర్ వాళ్ళు ఆ సినిమా తీసుకురారు , రెండు   కరెక్ట్ గా ఆ సినిమా రిలీజ్ ఐన టైం లో మన రాష్ట్రం లో తెలంగాణా విషయం మీద చాలా ఉదృత౦గా  గొడవలు జరుగుతున్నాయి. అందు వలన మన వాళ్ళు ఎవరు ఆ సినిమా మీద అంత గా ఫోకస్ చెయ్య లేదు. కానీ ఇక్కడ చెప్పు కోవలసిన విషయం ఏంటి అంటే అదే కాన్సెప్ట్ మీద పర బాషల లో చాలా చిత్రాలు వచ్చాయి. అవి వాళ్ళ రాష్ట్రము లో ఎంత దారుణంగా ఫెయిల్ ఐన మన తెలుగు ఇండస్ట్రీ  మహానుబావులు  వాటికి కూడా ఫ్యాన్సీ రైట్స్ ఇచ్చి మరీ కొంటారు. అంత ఎందుకు మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే మన సినిమా ని పర బాష వాడు రీమేక్ చేసి రిలీజ్ చేస్తే మన వాళ్ళు దాన్ని మళ్లీ తెలుగులోకి డబ్బింగ్ చేసి మళ్లీ మన మీదకే వదులుతారు. ఉదాహరణకి ఇడియట్ సినిమా ని తీసుకుంటే తెలుగులో అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలుసు. రాష్ట్రము లో ఉన్న ప్రతి ఒక్కరు కనీసం ఒక్క సారి అన్న చూసే ఉంటారు. దీంతో ఆ సినిమా ని తమిళ్ బాష లోకి రీమేక్ చేసి వదిలారు. అక్కడ అంతగా ఈ సినిమా ఆడలేదు. అయితే మన ఇండస్ట్రీ పెద్దలు కొందరు మళ్లీ ఆ సినిమా ని తెలుగు లోకి డబ్బింగ్ చేసి మన జనాల మీదకి వదిలారు. సరే ఈ విషయాలు అన్ని మరో టపా లో చర్చిద్దాము.                                    

ఇక అసలు విషయం లోకి వచ్చేద్దాము. అయితే నేను ముందు సినిమా స్టొరీ చెప్పి తరువాత ఆ సినిమా పేరు చెపుతాను. కనీసం కొంత మంది ఐన స్టొరీని అర్ధం చేసుకొని పేరుని అయ్డెన్టిఫయ్ చేస్తారు ఏమో అని చిన్ని ఆశ. కధలోకి వెళ్తే మన సమాజంలో ఉన్న అందరు అనుబవిస్తున్నట్టే, కొందరు వ్యక్తులకు గవర్నమెంట్ ఆఫీసు లో పనులు కాక ఏమి చెయ్యాలో తెలీక ఆలోచిస్తున్న టైం లో దగ్గరలో ఉన్న ఒక సెల్ఫ్ ఎంప్లోయ్డ్ పర్సన్ వచ్చి తన ద్వారా ఆ పని జరుగుద్ది అని కాకపోతే అందుకు కొద్దిగా ఖర్చు అవుద్ది అని చెపుతాడు. దానితో వారు కొంచం కాదు చాలా ఖర్చు ఐన భరిస్తాము అని చెప్పటం తో దానికి ఆ వ్యక్తి అయితే ఇది చాల పెద్ద పని లాగ ఉంది కాబట్టి తన గురువు(హీరో) ద్వారా మాత్రమే జరుగుద్ది అని చెపుతాడు.  మన హీరో గారి గొప్ప తనం ఏంటి అంటే వారు CM గారికి కూడా సహాయ పడుతూ ఉంటారు. దానికి వాళ్ళు సరే అని అతని గురువుని(హీరో) తీసుకొని వాళ్ళ ఆఫీసు కి వెళ్లి విషయం చెప్పి ఎంత ఖర్చు ఐన పరవాలేదు ఆ ఫ్లయ్ ఓవర్ కాంట్రాక్టు తమకే కావాలని అడుగుతారు. సరే నాన్న మన హీరో సదరు గవర్నమెంట్ ఆఫీసర్ ని కలుస్తాడు, అయితే ఆ ఆఫీసు ఎవరికీ లొంగడు కానీ అతనికి ఉన్న వీక్నెస్ అడ్డం పెట్టుకొని మన హీరో సదరు కాంట్రాక్టు ఆ ఆఫీసు వాళ్ళకే వచేటట్టు చేస్తాడు. దాంతో వాళ్ళు ఇతనికి కొద్దిగా దక్షిణ ఇస్తున్నప్పుడు ఆ ఆఫీసు మేనేజర్ తో ఒక మాట అంటాడు. అప్పుడు అప్పుడు ఐన కొద్దిగా నిలబడే ప్రాజెక్ట్లు కట్టండి సర్ అని. కానీ మన హీరో కి ఏం తెలుసు పాపం తను ఇప్పించిన ఈ కాంట్రాక్టు వాళ్ళ తనకే అనుకోని నష్టం జరుగుతుంది అని. ఈ లోగా ఒకానొక కలెక్టర్ గారు ACB దాడిలో దొరికినప్పుడు మన హీరో గారు తనకు ఉన్న పరిచయాలతో సదరు కలెక్టర్ని ఆ కష్టం నుండి బయట పడేస్తారు. అయితే ఆ సమయంలో సదరు కలెక్టర్ గారి కూతురు వాళ్ళ నాన్నతో తన స్నేహితులు అందరు హేళన చేస్తున్నారు అంటూ  “కేవలం మా కడుపు నింపడానికి ఇతరుల కడుపులు కొట్టొద్దు నాన్న అంటుంది”.

ఈ లోగా ఊళ్ళో  ఒక  ఫ్లయ్ ఓవర్ కూలిపోతుంది. దారుణం ఏంటి అంటే ఈ ఫ్లయ్ ఓవర్ కూలి పోయి మన హీరో ఏకైక కొడుకు చనిపోతాడు. అయితే అప్పుడు హీరో బాధ పడుతూ ఉన్న సమయంలో పక్కనే ఉన్న తన మిత్రుడిని కాంట్రాక్టర్ ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ మిత్రుడు చెప్పే సమాధానం అన్నా ఇది మనం కాంట్రాక్టు ఇప్పించి కట్టిన ఫ్లయ్ ఓవరే అని. అంత భాదలో కూడా హీరో తన వృత్తి ధర్మాన్ని మర్చిపోడు. ఆ ఫ్లయ్ ఓవర్ కాంట్రాక్టర్ ఫోన్ చేసి అపోసిషన్ వాళ్ళు దీన్ని ఇష్యూ చెయ్యకుండా మేనేజ్ చెయ్యమంటే ,వెంటనే అపోసిషన్ లీడర్ కి ఫోన్ చేసి చనిపోయింది తన కొడుకే అని , దీన్ని ఇష్యూ చెయ్యద్దు అని చెప్తాడు. ఆ సీన్ ని చూసిన ప్రతి ఒక్కరు హీరో ని ఖచ్చితంగా అసహ్యించుకుంటారు. ఆఖరికి  ఇతని భార్య కూడా పుట్టింటికి వెళ్లి పోతుంది. ఈ లోగా ఒకానొక TV ఛానల్ వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ పేరుతో తాము ఒక పెద్ద ఇష్యూ ని కనుగొన్నామని దాని ని ప్రతి ఒక్కరు చూడాలని ప్రచారం చేస్తారు. దీంతో ఈ విషయం మీద రాష్ట్రము మొత్తం చర్చ జరుగుతూ ఉంటుంది.


టీవీ ఛానల్ వాళ్ళు ముందు చెప్పినట్టు చర్చ మొదలు పెడుతూ దీనికి ప్రత్యక్ష సాక్షి గా మన హీరో నే ప్రవేశ పెడతారు.అతని ద్వారా అందరి జాతకాలు ఒక్కొక్కటిగా బయట పెడతాము అని చెపుతారు . దీంతో హీరో ద్వారా పనులు చేయించుకున్న అందరు పెద్దలు, ఆఖరికి మన CM గారు కూడా ఈ చర్చను ఆపి వెయ్యాలని రక రకాల ప్రయత్నాలు వేస్తారు. అయితే హీరో తాను ఎందుకు approver గా మారాలని అనుకున్నాడో చెపుతూ ఒక మాట చెబుతాడు. “కొడుకు చని పోయినప్పుడు వాడి శవాన్ని ముందు పెట్టుకొని కూడా బ్రోకర్ పని చేసాను” అని. తరువాత ఇలా తన ద్వారా పనులు చేయున్చుకున్న వ్యక్తుల విషయాలు చెపుతూ మొదట తను పని చేసే నాయకుడి కొడుకుల గురించి చెపుతాడు. వారు చేసిన పనిని కెమెరా ద్వారా ముందుగా రికార్డు చేసి ఉంచిన దానిని లైవ్ లో చూపిస్తాడు. దీంతో పోలీసు వారు వాళ్ళని అర్రెస్ట్ చేస్తారు. తరువాత ఆ లైవ్ షో ఏంకర్ మిగతా వారి గురించి చెప్పమన్నప్పుడు కొద్ది సేపు ఆలోచించి ఇక తాను ఎవరి గురించి చెప్పను అని చెపుతాడు. దీంతో ఆ ఏంకర్ ఇది తప్పు అని వాదిస్తాడు. అప్పుడు హీరో ఇదే తాను ఆ వ్యక్తులు  అందరికి ఇచ్చే చివరి అవకాశం అని, దాంతో ఐన అందరు వ్యక్తులు మారతారని చెప్తే అందుకు ఒప్పుకోని ఏంకర్ వారు ఎప్పటికి మారారు అని వాదిస్తాడు. అయితే అప్పుడే హీరో లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేరం అని,ఇలా అందరిని నిర్మూలించుకు౦టూ పోతే ఎవ్వరు మిగలరు అని వాదిస్తాడు. దీంతో ఆ ఏంకర్ కొద్దిగా కరిగి అయితే తన ఫోన్ లైన్స్ అన్ని ఒక గంట పాటు ఓపెన్ చేసే ఉంటాయని కనీసం ఒక్కరు అయునా ఈ గంటలో ఫోన్ చేసి పబ్లిక్ గా షో లో తాము చేసిన తప్పులు ఒప్పుకుంటే ఆ  డిటైల్స్ బయటపెట్టనని లేక పోతే అందరి డిటైల్స్ చెప్పాలని అంటాడు. దీనికి హీరో కూడా ఒప్పుకుంటాడు. ఇక్కడ అందరు ఎవ్వరైనా ఒక్కరన్న కాల్ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు.

 
ఎవ్వరి ఊహ కి అందనట్టు మొదటి కాల్ పూర్వం మన హీరో ద్వారా సహాయం తీసుకున్న కలెక్టర్ గారు చేస్తారు. ఆయన కాల్ చేసి తాను చేసిన అవినీతి పనులు అన్ని ఒప్పుకోని తాను సైతం ఈ యఘ్యం లో ఒక సమిధగా మారే అవకాశాన్ని ఇచ్చిన హీరో ని అబినందిస్తూ తాను అక్రమంగా సంపాదించిన డబ్బు ఎంతో చెపుతారు. ఇక ఆ తరువాత ఒకటి తరువాత ఒకటి , ఇంతై ఇంతై వటుడి౦తై అన్నట్లు అందరు ఫోన్ చేసి తాము సంపాదించిన అవినీతి సొమ్ము లెక్క చెప్తారు. చివరలో CM గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రాష్ట్రము లో అందరు చూస్తున్న లైవ్ షో ద్వారా ఇంత గొప్ప మార్పు తెచ్చిన హీరో ని, అలాగే TV ఛానల్ వారిని అబినందించి ఒక చారిత్రక నిర్ణయం వెల్లడిస్తారు. ఆ తరువాత CM గారు తన సంపాదన లెక్క కూడా ప్రజలకు తెలియచేస్తారు. దాంతో అందరూ హీరో ని చప్పట్ల తో అభినందిస్తూ ఉంటె తాను ఎంతో వినమ్రంగా అందరికి నమస్కరిస్తూ వీడ్కోలు తీసుకుంటాడు. ఈ సన్నివేశానికి మన  ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామ్ పాడిన ఒక పాట అత్యద్భుతం.


ఈలోగా మీ అందరికి ఈ సినిమా పేరు అర్ధం అయ్యే వుంటుంది అని ఆశిస్తున్నాను. ఐడియా రాని వారి కోసం చెప్పేస్తున్నాను . ఈ సినిమా పేరు “బ్రోకర్ “. ఇందులో కలెక్టర్ గా నటించింది శ్రీహరి గారు. ఈ సినిమా కి అన్నీ తానై  ధర్శకత్వం వహిస్తూ, హీరో గా నటించింది ఒకప్పటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ RP పట్నాయక్ గారు. ఈ సినిమా చూసే అంత వరకు నాకు నిజం గా RP గారిలో ఇంత మంచి ప్రతిభ ఉంది అని తెలీలేదు. కేవలం ఒక మ్యూజిక్ డైరెక్టర్ గానే అనుకున్నాను. తన దాక వస్తే కానీ మనిషికి కష్టం విలువ తెలీదు అని ఈ సినిమా ద్వారా RP గారు చాల గొప్పగా చూపించారు. కేవలం స్టార్ కాస్ట్ లేక పోవడం వలన, పబ్లిసిటీ లేక పోవడం వలన ఈ సినిమా అంతగా ఆడలేదు అని నమ్మకం. కనీసం ఇప్పుడు ఐన ఏ కొంత మంది ఐన సరే ఈ సినిమా చూసి దాని ద్వారా వచ్చే మెసేజ్ అర్ధం చేసు కున్నట్లు అయితే ఈ సినిమా యొక్క లక్ష్యం కొద్దిగా ఐన నేరవేరినట్టే.
                                                  

ఇంతటితో ఆత్మఘోషాత్మక, గతితార్కిక, అతిమార్మిక, మతిప్రేరితముగా కనంబడు ‘తెలుగోడు’ అనంబడు నా ప్రథమ రచన సంపూర్ణము….సర్వేజనార్పణమస్తు!

Your views are valuable to us!