Like-o-Meter
[Total: 0 Average: 0]

అనాదిగా జీవుడు
పునాదుల వెతుకులాటలో
మునిగి తేలుచున్నాడు
పుట్టిన ప్రతి సారీ
తానెవరో తెలుసుకొనే తపనలో
యుగాదులు గడుస్తున్నా
పగ, ప్రతీకారాదులే పరమార్ధాలు
నిజాలు తెలిసే సరికి నీరసాలు
ఇదే చక్ర భ్రమణం లో జీవి
నిరంతర బాటసారి
కోకిల రావాలు పూల సుగంధాలు
ప్రకృతిలోని అందాలు
ఆరు రుచుల ఆటలు
అణగారని కోరికలూ
పరిమితమైన వనరులు
సంసారపు ఈతి బాధలు
కలగాపులగంగా అనుభవించేదే
ఈ యుగాది కావాలి ఇది
సార్ధక నమధేయి
విజయీ భవ !!