Like-o-Meter
[Total: 0 Average: 0]
వసంతంలో చిగిర్చి కొత్త ఆకులు తొడిగి
పూవులు పూసి కాయలు కాసి
భానుడి తీవ్రతలో భాసించి
సమస్త జీవాలకు నీడను గూడును ఇచ్చి
అలుపెరగక ఆశ పడక
జీవం ఉట్టిపడేలా నిలచిన ఈ చెట్లకు
సన్మానం చేసేందుకు వచ్చేదే తొలకరి
ఎక్కడ చూసిన పచ్చదనం
దానికి స్వచ్చత చేకూర్చే వర్షం
మనసున్న ప్రతి మనిషి
వర్ష ఋతు శోభను
ఆఘ్రాణించ వచ్చు
తాక వచ్చు
చూడ వచ్చు
విన వచ్చు
ఆస్వాదించ వచ్చు హృదయం తో
ఒక గేటు పక్క తనంత తానుగా
మొలిచిన ఒక తులసి మొక్క
రాత్రి కురుసిన వర్షం తో తాను పొందిన తాదాత్మ్యత
ఉదయాన్నే తన స్వచ్చత లో చూపింది
పూవు కోయాలన్న ఆకు తెమ్పాలన్నా
పూజ కొరకైనా సరే మనస్కరించలేదు
వాటి సౌందర్యం స్వచ్చత ఊహాతీతం
పరమాత్మే పత్యక్షం గా ఉన్నాడని తెలిసి
చేష్టలుడిగి చివరికి నమస్కరించి తరించా