యధాదర్శో మలేన చ …

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

యధాదర్శో మలేన చ …

అబద్ధాన్ని కప్పుకొని ఒక నిజం నీలుగుతోంది
జుట్టు తెల్లబడితే రంగేసుకొని కప్పిన వయసు లా

ముడతలు బడ్డ తనువుని
ముదురు లేత రంగు బట్టలు
ముచ్చటగా కప్పేసాయి

చూపు మందగించినా
లాసిక్ లావణ్యాలు
కళ్ళ జోడుని కాలరాసాయి

మనిషి అసలు నైజం
అత్యంత గోప్యమైన రహస్యం లా
మౌనంలోనే దాగిఉంది
ఔనో కాదో తెలియని అయోమయంలా

విరాగిలా ఎందఱో కాముకులు
విశ్వనాథుని గురించి వివరిస్తున్నారు

త్రోసిరాజన్నా నీవు దాసివే అంటూ
దైవం జీవి వైపుచూస్తోంది ఆనందంగా

Your views are valuable to us!