వైకుంఠపాళీ – పందొమ్మిదవ భాగం

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 5]

గత భాగం: సుమతి గర్భవతి అవుతుంది. దంపతులిద్దరూ తల్లి-బిడ్డల మధ్య గల సంబంధం గురించి, భగవంతుడి లీల గురించీ చర్చించుకుంటారు. రంజనిని కలుసుకుంటాడు అనంత్. ఇద్దరూ సహజీవనాన్ని కొనసాగించాలని నిశ్చయిస్తారు. తన గురువుగారైన శర్మను కలవడానికి రావల్సిందిగా చెబుతాడు విశ్వేశ్వర్. కానీ అనంత్ తో ఉన్న రంజని రాలేనని చెబుతుంది. అంతగా కలవాలనుకున్న వ్యక్తిని కనీసం ఫోన్లో నైనా పలకరించమని సలహా ఇస్తాడు అనంత్. విశ్వేశ్వర్ కు ఫోన్ చేసిన రంజని అనుకోకుండా సుమతితో మాట్లాడుతుంది. బలమైన ఉద్వేగానికి లోనౌతుంది రంజని. శర్మ దంపతులు పట్టణాన్ని వదిలి వెళ్ళిపోతున్నారని విశ్వేశ్వర్ ద్వారా తెలుసుకున్న రంజని వాళ్లు ఏ ఊరు వెళుతున్నదీ సుమతి ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఫోన్ కట్టైపోతుంది. ఎంత ప్రయత్నించినా లైన్ దొరకకపోవడం తీవ్ర నిరాశకు గురౌతుంది రంజని.

 

“అరవింద్ వచ్చాడు!” అని రంజని చెవిలో గుసగుసగా అంది పావని.

టేబుల్ సొరుగులోంచి ఓ కాగితం తీసుకుని అరవింద్ కేబిన్లోకి నడిచింది రంజని.

“హా…రంజని…కమ్ కమ్” అని సాదరంగా ఆహ్వానించాడు అరవింద్.

రంజని కుర్చీలో కూర్చుని, ఒక్క నిముషం ఆగి, చేతిలో ఉన్న కాగితాన్ని అరవింద్ ముందుకు తోసింది.

ఆశ్చర్యంగా చూస్తూ కాగితాన్ని చదువుతున్న అరవింద్ ముఖంలో కవళికలు వెంటవెంటనే మారిపోయాయి. ముడిపడిన కనుబొమ్మలతో, భూతద్దాల్లాంటి కళ్ళద్దాల్లోంచి చూస్తూ – “వాటీజ్ దిస్ రంజని? ఎందుకిలా చేస్తున్నావ్? ఎనీ థింగ్ రాంగ్ హాపెండ్? ఆర్ ఈజ్ దిస్ మై ఫైల్యూర్?” అని గబగబా అడిగాడు.

రంజని చిన్నగా నవ్వింది.

“నువ్వంటున్నవి ఏవీ కావు అరవింద్! నువ్వో బెస్ట్ లీడర్. కాబట్టి నీకెప్పుడూ ఫైల్యూర్స్ రావు. నథింగ్ రాంగ్ హాపెండ్ ఇన్ దిస్ కంపెనీ సో ఫార్. కానీ నేనీ డెసిషన్ తీసుకోవడానికి మీరెవ్వరూ కారణం కాదు!”

“దెన్? హూ ఈజ్ దట్ పర్సన్! నిన్నీ పని చెయ్యడానికి ఎంకరేజ్ చేసిందెవరు? ఐ హోప్ ఇటీజ్ నాట్ అనంత్!!”

కాదన్నట్టు తలూపింది రంజని – “అనంత్ ను అనుమానిస్తున్నావా? పాపం! ఇప్పుడెంత మారిపోయాడో తెలుసా? అతనిప్పుడో జెమ్ ఆఫ్ పర్సనాలిటీ!” అని నవ్వింది రంజని.

అరవింద్ కూడా బలహీనంగా నవ్వుతూ “ఐతే ఈ రెజిగ్నేషన్ ఎందుకిస్తావ్? ఎవరి కోసం?” అని అడిగాడు.

“నా కోసం!” ముక్తసరిగా చెప్పింది రంజని.

“ప్లీజ్ రీకన్సిడర్!” అన్నాడు అరవింద్ అంతే ముక్తసరిగా.

“సారీ!” అంది రంజని మరింత క్లుప్తంగా.

“హుష్…” అంటూ ఆకాశంలోకి చూడసాగాడు అరవింద్.

“స్టెల్లాను ప్రమోట్ చేయ్. షీ విల్ గివ్ యూ ద రైట్ సపోర్ట్!” అంది రంజని.

“అప్పుడే అన్నీ డెసిషన్స్ తీసేసుకున్నావా? వెల్…యాజ్ యూ లైక్….కానీ నేను మాత్రం హ్యాపీగా లేను.” అన్నాడు అరవింద్ తలను అడ్డంగా ఊపుతూ.

“ప్లీజ్ అరవింద్! అలా అనకు! ఐ యామ్ ట్రైయింగ్ టు సేవ్ మై సోల్!” – నెమ్మదిగా అంది రంజని.

కుర్చీలోనుంచి లేచాడు అరవింద్. రంజనీ కూడా లేచింది. తన చెయ్యి ముందుకు చాచాడు అరవింద్. రంజని తన చేతిని చాచింది. గట్టిగా షేక్ హ్యాండిస్తూ – “మై బెస్ట్ విషేష్ ఆర్ దేర్ విత్ యూ ఇన్ ఆల్ యువర్ బెస్ట్ ఎండీవర్స్!” అని నవ్వుతూ అన్నాడు అరవింద్.

“థాంక్స్!” అని చెప్పి కేబిన్ బైటకు నడిచేముందు “ముందు వారానికి రిలీవ్ చెయ్యగలవా?” అంది రంజని.

సరేనన్నట్టు తలూపాడు అరవింద్.

రంజని ముందుకు నడిచింది.

– – – – – – –

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
 

ఆ రాత్రి….

“నిన్న, ఎవరామె?….హా….సుమతి….ఆమెతో మాట్లాడేప్పుడు నువ్వెంత క్రేజీగా బిహేవ్ చేసావో తెలుసా?” అన్నాడు అనంత్.

“క్రేజానా! నా ఫీలింగ్స్ నీకు అర్థం కావులే! అందుకే అలా అంటావు!”

“అలాగైతే, అర్థమయ్యేట్టుగానే చెప్పు…వింటాను!” అన్నాడు అనంత్ చేతులు కట్టుకుని.

కుర్చీలో వెనక్కు వాలింది రంజని – “ఎలా చెప్పేది?” అంటూ.

“అదేమరి! నీకే సరిగ్గా తెలీదు కానీ నన్ను దెప్పి పొడుస్తావ్!” అంటూ రంజనిని ఎద్దేవా చేసాడు.

“ఆహా! నాకు తెలీక కాదు….ఆ ఫీలింగ్స్ మామూలు మాటల్లో చెప్పడానికి చేతకాక!” అంది రంజని. “శీతకాలంలో గడ్డ కట్టిన నీరు కరిగి ప్రవహించడానికి ఎంతో ఆత్రపడుతుంది కానీ ప్రవహించలేదు. సుమతి విషయంలో నా మాటలూ అంతే!”.

“వోవ్! వాటే పొయెట్రీ!!” అంటూ చిన్నగా చప్పట్లు కొట్టాడు అనంత్.

“ఇట్స్ నాట్ జస్ట్ పొయెట్రీ అనంత్! ద పవర్ ఆఫ్ ట్రూ అడ్మిరేషన్! సుమతిలోని ఆ పవర్ ఆమె సింప్లిసిటీలో ఉంది. ఆమెకు ఎన్నో తెలుసు బట్ అణకువతో ఆ గొప్పదనాన్ని దాచిపెడుతుంది. కానీ కదిలిస్తే చాలు గంగాప్రవాహంలా దప్పిక తీరుస్తుంది. ఆమె పవర్ ఆమె డెడికేషన్లో ఉంది. నీకు తెలుసా! భర్తపై ఆమెకెంత నమ్మకమో తెలుసా? తన గురుత్వాకర్షణ శక్తిపై భూమికున్నంత నమ్మకం!”

“ఓహ్!” అన్న అనంత్ – “చాలా పొగుడ్తున్నావే? ఎందుకో….” అంటూ ఆగాడు.

“అనంత్! ఇక్కడో మాట చెప్పాలి. అయస్కాంతం అట్రాక్ట్ చేస్తుంది. ఆ అట్రాక్టింగ్ పవర్ అన్నది అయస్కాంతానికున్న న్యాచురల్ క్వాలిటీ. వుయ్ కెనాట్ క్వశ్చన్ ఎనీ వన్ ఆన్ దిస్! నో వన్ కెన్ ఛేంజ్ ఆల్సో! అలాగే మనిషిలో ప్రాక్టికాలిటీ ఉన్నప్పుడు, అది అయస్కాంతంలా అట్రాక్ట్ చేస్తుంది. సుమతి అయస్కాంతంలాంటిది. ఆమెలో ఉన్న ప్రాక్టికాలిటీ ఆమెకున్న పవర్. ఇ యామ్ కంప్లీట్లీ అట్రాక్టెడ్ బై ఇట్ అండ్ అనేబుల్ టు కమౌట్!” అంది రంజని.

మౌనం వహించాడు అనంత్. అతనికి తన భార్య ప్రవర్తన విచిత్రంగా అనిపిస్తోంది. అంతేకాదు ఆ సుమతి పట్ల రంజనికి ఉన్న అభిమానాన్ని చూసి ఈర్ష్య పడసాగాడు. “ఆమె పై నీకున్న అభిమానంలో పావువంతు కూడా నా మీద లేదనుకుంటా?”

“అలా ఎందుకనుకుంటావ్?”

“ఎందుకనుకొకూడదు!”

“అనుకోకూడదు. ఎందుకంటే నువ్వు నా హజ్బెండ్. ఆమె ఓ ఫ్రెండ్. ఇద్దరికీ చాలా తేడా ఉంది.” అంది రంజని.

“ఆహా! అంటే మొగుణ్ణి తిట్టడం, ఫ్రెండును పొగడ్డం పతివ్రత లక్షణమా?” అని గేలిగా అన్నాడు అనంత్.

ఎందుకో మామూలుగా వచ్చే కోపం ఆ సమయంలో రంజనిని పూనలేదు. బదులుగా అపారమైన శాంతత ఆమెను ఆవరించింది.

“భర్త అనేవాడు లైఫ్ లాంగ్ నడవాల్సినవాడు. కాబట్టి అతని తప్పొప్పుల్ని భార్య విమర్శించడంలో తప్పులేదు. ఫ్రెండ్స్ అలా కాదు. వస్తూ పోతూ ఉంటారు. నిజానికి నా హైస్కూల్ ఫ్రెండ్స్ ఒక్కరు కూడా టచ్ లో లేరు….ఈవెన్ ఇన్ దిస్ ఇంటర్నెట్ ఏజ్! కానీ నేను, నువ్వు అలా వస్తూ, పోతూ ఉండలేం కదా! అఫ్ట్రాల్ మనిద్దరం భార్యాభర్తలం కదా!” అంది రంజని.

“బహుత్ ఖూబ్! నువ్వు చెప్పింది చాలా బావుంది! కానీ నా క్వశ్చన్ కు ఆన్సర్ దొరకలేదు. ఐ రిపీట్….ఫ్రెండ్ పొగుడ్తూ, భర్తను తిట్టాలా?”

“అరే! దిస్ ఈజ్ ఫన్నీ! నేను చెప్పినదాంట్లో నీ ప్రశ్నకు సమాధానముంది. నువ్వు అర్థం చేసుకోవడంలేదు. ఐ టూ రిపీట్….వచ్చీ పోయే ఫ్రెండ్స్ దగ్గర నుండి మనం మంచి విషయాల్ని కలెక్ట్ చేసుకొని, నేర్చుకోవచ్చు. అందుకు వాళ్ళకి థాంక్స్ చెప్పాలి. కానీ భార్యాభర్తలు అలా కాదు. లైఫ్ లాంగ్ కలిసివుండాల్సిన వాళ్ళు. లైఫ్ లాంగ్ తప్పొప్పుల్ని తెలుసుకుంటూ, మిస్టేక్స్ ను సరిచేసుకొంటూ పోవాలి. కాబట్టి ఉత్తినే పొగుడుకుంటూనో, తిట్టుకుంటూనో కూర్చునే రిలేషన్ కాదది! అండర్స్టాండ్?” అని ఆగింది రంజని.

తర్వాత ఏం మాట్లాడాలో తోచని అనంత్ అర్థమైంది అన్నట్టుగా తలూపాడు.

కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు.

“అనంత్! ఐ వాంట్ టు బీ ఏ హౌస్ వైఫ్!” అని హటాత్తుగా అంది రంజని.

“వాట్?…….వై?” అన్నాడు అనంత్ అర్థం కానట్టు.

“ఈ ఉద్యోగం, ఈ ఉరుకులు పరుగులు, సంపాదన కోసం తాపత్రయాలు…..ఇవేవీ నాకొద్దు! నేను హాయిగా ఇంట్లో ఉంటాను.”

“ఆ….ఉండి…ఏం చేస్తావ్?”

“నిన్ను చూసుకుంటాను. ఇంటిని కనిపెట్టుకుని ఉంటా! భక్తి ఎక్కువైనప్పుడు పూజలు, ఇంకా ఎక్కువైనప్పుడు భజనలు చేసుకొంటా….” విశాలంగా నవ్వుతూ అంది రంజని.

అనంత్ వెంటనే జవాబునివ్వలేదు. రంజని కూడా బలవంతం చెయ్యలేదు.

మళ్ళీ మౌనం ఇద్దరి మధ్యా తచ్చాడింది.

“సో! యూ వాంట్ టు బీ వన్ మోర్ సుమతి?” అని నెమ్మదిగా పలికాడు అనంత్.

నిశ్శబ్దంగా నవ్వింది రంజని.

“నాకేమో ఫిక్సెడ్ ఇన్కం లేదు. రిమెంబర్ దట్!” అన్నాడు అనంత్ హెచ్చరిస్తున్నట్టుగా.

“లీస్ట్ బాదర్డ్ అబౌట్ మనీ! ఐ వాంటి పీస్….ఇన్నర్ పీస్!” అంది రంజని.

“అలాగే!” అన్నాడు అనంత్.

అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని “థాంక్యూ!” అని ముద్దు పెట్టింది రంజని.

చాలాసేపు అతని చేతిని అలానే పట్టుకుని కూర్చుంది ఆమె.

* * * * *

“పంద్యాల పైన పంద్యం పడిన నీ రెండో ఆటకాయ అరవైనాల్గవ గడిలోని స్త్రీమూర్తిని చేరింది. ఈ నడకలోని తాత్పర్యమేమిటో?” అన్నాడు తత్పురుషవరేణ్యుడు.

“మీ దయాలబ్ధప్రాప్తమైన జ్ఞానశక్తితో వివరించడానికి ప్రయత్నిస్తాను ప్రభూ! అరవైరెండవ గడిలో రాజు ఉన్నాడు. అరవైమూడవ గడిలో ’భక్తి’ నిలచివుంది. ఆపై అరవైనాల్గవ గదిలో మీరు ఉటంకించిన స్త్రీమూర్తి ఉంది. ఈ మూడు గదుల్నీ అవలోకనం చేసినప్పుడు – అరవైరెండవ గదిలోని రాజు ’ఐశ్వర్యసంపద’లకు సూచన. అరవైనాల్గవ గదిలోని స్త్రీమూర్తి ’సుఖభోగా’లకు గుర్తు. ఈ రెండింటి మధ్య ’భక్తి’ చిక్కుకునివుంది. సాధారణంగా జీవులు ధనాసక్తులౌతారు లేదూ కాంతాదాసులౌతారు. తద్వారా భక్తికి దూరమై, మీ అనుగ్రహాన్ని కోల్పోతుంటారు. ఎవరైతే కాంతా-కాంచనాల ఆకర్షణను భక్తితో జయిస్తారో వారిలో చిత్తశుద్ధి మసకబారని దీపంలా వెలుగుతుంది.”

“బాగు బాగు! చూశావా….అరవైనాల్గవ గదిలోని స్త్రీమూర్తికి ప్రక్కనే నువ్వు పేర్కొన్న ’చిత్తశుద్ధి’ అనే గడి ఉంది. అక్కడి నిచ్చెనను ఎక్కిన జీవులు నేరుగా మహర్లోకాన్ని చేరుతారు.”

“ఆ మహర్లోకం యొక్క అంతరార్థాన్ని బోధించండి స్వామిన్.”

“అవశ్యం దేవీ! మహస్ అంటే పూజనీయమైనదని అర్థం. ఈ పూజనీయ స్థానాన్ని చేరుకోవడానికి కావల్సింది ’చిత్తశుద్ధి’. చిత్ సంజ్ఞానే అని ధాతువు. సంజ్ఞానమంటే అటినిటు కదలని, చెదరని మనోస్థితి. అంటే ఏకచిత్తత. ఈ ఏకచిత్తత సాధ్యమయ్యేది ఏకవాక్యత వల్లనే.”

“అజ్ఞులకూ అవగతమయ్యేలా వివరించండి ప్రభూ!” అని వేడుకుంది వేదవతి.

“దేవీ! జీవులు నిశ్చలమైన మనసును సాధించాలంటే మొదట తమ కార్యాలలో నిశ్చలత్వాన్ని సాధించాలి. చేసే పనులు శాస్త్రవిహితమై, ఫలాఫలాల పట్ల చెదరనితనంతో కూడినప్పుడు చెదరని మనసు సిద్ధిస్తుంది. అలాంటి ఏకచిత్తమే జీవుల ప్రథమలక్ష్యం. ’ఏకమ్ సత్’ అని కదా శాస్త్రవచనం! అలాంటి ఏకేశ్వరుణ్ణి ఏకచిత్తంతో ఏకాగ్రభావంతో భజించినపుడు లభించేదే పూజార్హమైన మహర్లోకం. ఈలోకం జీవులు నివసించే భూమి నుండి దూరంగా ఉన్నది. కానీ నా దయవల్ల భక్తుల అంతరంగాల్లో కూడా ఈ లోకానుభవం సాధ్యపడుతుంది. ఆస్తులు, అంతస్తులు, లౌకికవస్తుభోగాలను ఆశించని సాధకులెందరో భూలోకంలో పూజనీయులయ్యారు. అందుకు కారణం, వారి మనోలోకాల్లో ఈ మహర్లోక సాక్షాత్కారం వల్లనే దేవీ!”

“అమోఘమైన ఉపదేశం స్వామి! మాయాశక్తిని, పరాశక్తిని దాటిన మీ మొదటి ఆటకాయ ఈ పరమపద సోపాన పటపు చిట్టచివరి వరుసలోకి చేరింది. ఇక్కడి నుండి ఆట తీరు మారిపోతుందని విన్నాను. కేవలం ’ఒకటి’ సంఖ్య పడితేనే పావులు ముందుకు కదలాలని నియమాన్ని విధించారు మీరు. ఎందుకు స్వామీ?”

“కొన్ని నియమాలు రహస్యమయాలు దేవీ!”

“అనంతాలైన మీ రహస్యావతార ఉపాసనా పరాయణురాల్ని, నాకూ తెలియని రహస్యాలున్నాయన్న మాట! కాలమూర్తులైన మీరు దయ తలచిన కాలానికి ఈ రహస్యం బోధపడుతుంది. అప్పటిదాకా వేచి చూడ్డం కూడా సాధననే. మీ అనుగ్రహప్రాప్తికై ఎదురుచూస్తుంటాను ప్రభూ!”

“ఆ లోపు నా మొదటి పావును నడపనా?”

“అత్యవసరంగా నడపండి. మీ పావులు పవిత్రభావనాప్రపూరకాలు, దివ్యానుభూతితో అలరారే సాధకలు. వాటి ప్రతి నడకలోనూ మీకు దగ్గరయ్యే సూక్ష్మ మార్గాలు ఆవిష్కృతమౌతున్నాయి.” అంది అపరాజిత.

నవ్వుతూ పాచికల్ను కదిపాడు నారాయణుడు.

మహాక్రతు చేతి నుండి జారిన పాచికలు దశరథ చక్రవర్తి కృత పుత్రకామేష్టియాగారంభ సమయంలో ఋత్వికవరుడైన ఋష్యశృంగుని ముఖోద్భూత వేదమంత్రాల్లా ధ్వనించాయి.

* * * * * * *

(సశేషం…)

Your views are valuable to us!